Begin typing your search above and press return to search.

గంటా కు చంద్రబాబు నాయుడు అల్టిమేటం అదేనా!

By:  Tupaki Desk   |   14 Oct 2019 7:52 AM GMT
గంటా కు చంద్రబాబు నాయుడు అల్టిమేటం అదేనా!
X
'ఉంటే ఉండు.. పోతే పో..' అని అంటున్నాడట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. మాజీ మంత్రి గంటా శ్రీనిసరావు విషయంలో చంద్రబాబు నాయుడు ఇలా కుండబద్ధలు కొడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. గత కొన్నాళ్లుగా గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడతాడనే ప్రచారం గట్టిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో రివ్యూ మీటింగులు నిర్వహిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు.. గంటా శ్రీనివాసరావుకు ఆ మేరకు అల్టిమేటం ఇచ్చారట. పార్టీ లో ఉంటే ఉండవచ్చు - లేదంటే నిర్మొహమాటంగా వెళ్లిపోవచ్చని గంటా శ్రీనివాసరావుకు తేల్చి చెప్పాడట చంద్రబాబు నాయుడు.

గంటా తీరుపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. గంటా వరసగా నియోజకవర్గాలు మారడమే చంద్రబాబుకు నచ్చలేదట. తను అతడికి మంత్రి పదవి ఇచ్చినా ఇప్పుడు బయటకు వెళ్లిపోతున్నాడనే లీకులు ఇస్తుండటం పట్ల మరింత గరం అవుతూ ఉన్నారట ఆయన. ఇక పార్టీ లో ఉన్నా గంటా శ్రీనివాసరావు పూర్తిగా కుల రాజకీయాలు చేస్తూ ఉన్నాడని చంద్రబాబు ఫైర్ అవుతున్నాడట. చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో టచ్లో ఉంటూ.. ఆయన కుల రాజకీయాలు చేస్తూ వచ్చాడని చంద్రబాబు నాయుడు వాపోతున్నారట. ఈ నేపథ్యంలో అలాంటి గంటా పార్టీలో ఉన్నా, వెళ్లిపోయినా నష్టం లేదని అంటున్నాడట తెలుగుదేశం అధినేత.

ఇదే విషయాన్ని గంటా కు కూడా తెలియపరిచినట్టుగా సమాచారం. ఉంటే ఉండవచ్చు - వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చు..ఛాయిస్ మీదే అని తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ఇప్పుడు గంటా ఒకింత సంకట పరిస్థితుల్లో పడిపోయినట్టుగా సమాచారం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండమంటూ తనను ప్రాధేయ పడే వాళ్లు లేరు. ఇక రెండో విషయం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే. ఎమ్మెల్యే పదవిని వదులుకుని వెళ్లి మళ్లీ ఇప్పుడే ఎన్నికలను ఎదుర్కొనడం కూడా అంత తేలికేమీ కాదు. దీంతో గంటా శ్రీనివాసరావు మరింత తర్జనభర్జనల్లో పడిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.