Begin typing your search above and press return to search.

బాబు ఓ పేప‌ర్ పులి...ఢిల్లీలో పిల్లి

By:  Tupaki Desk   |   20 July 2018 8:45 AM GMT
బాబు ఓ పేప‌ర్ పులి...ఢిల్లీలో పిల్లి
X
గ‌త మూడురోజులుగా తెలుగు రాష్ర్టాల్లో ఒక‌టే హ‌డావుడి చేస్తున్న‌ది...టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు - ఆయ‌న అనుచ‌ర గ‌ణం. నాలుగేళ్ల అనుబంధం అనంత‌రం...హ‌ఠాత్తుగా రాష్ట్ర ప్రయోజ‌నాలు గుర్తుకు వ‌చ్చి గ‌గ్గోలు పెడుతూ ఆయ‌న దోస్తీకి దూరం అయిన తీరే విస్మ‌య‌క‌రం అనుకుంటే..దానికి కొన‌సాగింపుగా...తాజాగా బాబు చేస్తున్న కొత్త డ్రామా ప‌ర్వం...అవిశ్వాసం. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అవిశ్వాసం ఖ‌చ్చితంగా ఓడిపోతుంద‌నే విషయం అంద‌రికీ తెలిసిందే. అందుకే....ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా అంటే ఇంతెత్తున ఎగిరిప‌డే శివ‌సేన సైతం మ‌ద్ద‌తు ఇచ్చేంందుకు సిద్ధ‌ప‌డ‌లేదు. అయిన‌ప్పటికీ..బ్రాహ్మండం బ‌ద్ద‌లు అయిన‌ట్లు...బాబు ఆండ్ బ్యాచ్ హ‌డావుడి! ఈ మొత్తం ఎపిసోడ్‌ లో అత్యంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం..బాబు అమ‌రావ‌తి నుంచి అడుగు ముందుకు వేయ‌క‌పోవ‌డం.

అవిశ్వాసంపై పార్లమెంట్‌ లో చర్చ జరుగనున్న నేపథ్యంలో ఆయన గురువారం సాయంత్రం - శుక్ర‌వారం ఉద‌యం ముఖ్యమంత్రి - టీడీపీ `జాతీయ` అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వెలగపూడి సచివాలయంలో అధికారులతో విభజనాంశాలపై చర్చించారు. ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. అన్నింటి సారాంశం ఒక్క‌టే. కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని చెప్ప‌డం. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన మాట తప్పారని - అసలు అప్పటి భావోద్వేగం ఏమైందని బాబు ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావించాలని ఎంపీల‌కు సూచించారు. పార్లమెంట్‌ సభ్యులకు పంపించిన సమాచారంపై మరోసారి లోతుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుపతిలో - నెల్లూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను గుర్తుచేయాలని కోరారు. ఒక్కో అంశానికి కేంద్రం ముడుల మీద ముడులు వేస్తోందని, చిక్కుముడులను పెంచుతోందంటూ ఆయన మండిపడ్డారు. అభివృద్దికి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోందని విమర్శించారు. ఇవేవీ బ‌హిరంగంగా జ‌రిగిన‌వి కావు..చంద్ర‌బాబు పేరుతో వెలువ‌డిన ప్ర‌క‌ట‌న‌లు.

ఒక‌వేళ ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో ఉన్న‌వ‌న్నీ నిజ‌మే అనుకుంటే....బాబు గారి స‌త్తాలో వాస్త‌వం ఉన్న‌ట్లైతే...అమ‌రావ‌తి నుంచి ఆర్డ‌ర్ వేసేబ‌దులు...ఆదేశాలు ఇచ్చేబ‌దులు..నేరుగా ఢిల్లీకి వెళ్ల‌వ‌చ్చుక‌దా? వ్యూహ‌క‌ర్త‌గా..చ‌క్రం తిప్పిన నాయ‌కుడిగా పేరున్న చంద్ర‌బాబు ఎందుకు పార్ల‌మెంటు హౌస్‌లో నుంచే త‌న పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌డం లేదు? బాబు అమ‌రావ‌తి నుంచి చేసే ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ...ఆర్భాట‌మేనా? ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు...ఘీంకారాలు అన్నీ...పేప‌ర్ల వ‌ర‌కేనా? స్థూలంగా బాబు పేప‌ర్ పులి...ఢిల్లీలో పిల్లా? అనేది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ‌.