Begin typing your search above and press return to search.

ట్రెండ్ సెట్ చేయ‌డం ఎలాగో చెప్పిన బాబు

By:  Tupaki Desk   |   20 Oct 2016 11:24 AM GMT
ట్రెండ్ సెట్ చేయ‌డం ఎలాగో చెప్పిన బాబు
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త‌న‌కిష్ట‌మైన ఐటీ గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. విశాఖలోని సీతమ్మధార వుడా కాంప్లెక్స్‌ లో 8 ఐటీ కంపెనీలను ప్రారంభించిన అనంతరం చంద్ర‌బాబు మాట్లాడుతూ భార‌త‌దేశానికి ఉన్న విశిష్ట‌త‌ల‌తో స‌మానంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ సైతం ప్ర‌త్యేక‌త‌లు క‌లిగి ఉంద‌ని తెలిపారు. సుసంప‌న్న‌మైన‌ మేధోసంపత్తి మ‌న‌దేశం సొత్తు అయితే కొత్త ట్రెండ్ సృష్టించ‌డంలో ఏపీ కేరాఫ్ అడ్ర‌స్ అని చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం డ‌బ్బు - ఆయుధాలతో కాకుండా జ్ఞానం ఆధారంగా న‌డుస్తోంద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. అందుకే జ్ఞానం ఉన్న వ్యక్తులే ప్రపంచాన్ని జయిస్తారని బాబు వివ‌రించారు.

హైద‌రాబ‌ద్‌ లో ఐటీ రంగం ప్రారంభం నుంచి మొద‌లుకొని విస్తృతి వ‌ర‌కు తాను కృషిచేసిన‌ట్లు చంద్ర‌బాబు వివ‌రించారు. అదే రీతిలో ఏపీ కోసం ప‌లు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు. ప్రస్తుతం 8 ఐటీ కంపెనీల ఏర్పాటుతో పాటు మరో 32 కంపెనీలతో ఎంవోయూ ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు వివ‌రించారు. ప్ర‌పంచ టెక్నాల‌జీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ త‌న డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు అంగీక‌రించింద‌ని బాబు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. టెక్నాల‌జీ ఫ‌లాల‌ను అందిపుచ్చుకునే దిశ‌గా తాము విద్యార్థులు - నిరుద్యోగులు - వ్యాపార‌వేత్త‌ల‌ను ప్రణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు రావాల్సిన అవసరముందని ఉద్యోగాల కోసమే కాకుండా.. తామే నలుగురికీ ఉద్యోగాలు కల్పించే స్థాయికి విద్యార్థులు - నిరుద్యోగులు ఎద‌గాల‌ని ఆయ‌న సూచించారు. రాష్ట్రంలో కంపెనీల ఏర్పాటుకు ఐటీ కంపెనీలు ముందుకు వస్తే.. సకల సౌకర్యాలు కల్పిస్తామని, వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చేవారిని ప్రోత్సహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇన్నేవేషన్‌ చాప్టర్లను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏపీని మరో సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దాలన్నదే తన ఆకాంక్ష అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/