Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కామెంట్ల‌తో తెగ హ‌ర్ట్ అవుతున్న బాబు

By:  Tupaki Desk   |   24 April 2018 5:58 PM GMT
ప‌వ‌న్ కామెంట్ల‌తో తెగ హ‌ర్ట్ అవుతున్న బాబు
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హ‌ర్ట‌వుతున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై స్పందిస్తూ త‌న‌పై అమ‌రావ‌తిలోనే కుట్ర జ‌రుగుతోంద‌ని, మంత్రి లోకేష్ ఇందుకు సూత్ర‌దారిగా ఉన్నార‌ని ఆయ‌న ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇన్నాళ్లు ప‌రోక్షంగా స్పందించ‌గా తాజాగా డైరెక్టుగానే ఆయ‌న స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే సదస్సులో పాల్గొని పంచాయితీ భవనాలు, అంగన్ వాడీ భవనాలు, సీసీ రోడ్ల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ ప‌వ‌న్ త‌మ‌పై కామెంట్లు చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌న్నారు.

ధ‌ర్మ‌పోరాట దీక్ష పేరుతో తాను ఉద్య‌మిస్తున్న రోజే ప‌వ‌న్ ఫిలిం చాంబ‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేయ‌డంపై బాబు ప‌రోక్షంగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సంద‌ర్భంగా ప‌రోక్షంగా స్పందించిన బాబు తాజాగా ప‌వ‌న్‌పై నేరుగానే అటాక్ చేశారు. నిన్నటి వరకు తమతో పాటు కలిసి నడిచిన పవన్ కల్యాణ్ ఇప్పుడు విమర్శిస్తున్నారంటూ ఆక్షేపించారు. 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యవస్థలపైనే పారటం చేశాను కానీ.. వ్యక్తులపై బురుదజల్లే పని చేయలేదంటూ వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. మిత్రపక్షం అని నమ్మితే... ఘోరంగా మోసం చేసిన బీజేపీపై ధర్మ పారాటానికి నాంది పలికానని చంద్ర‌బాబు పేర్కాన్నారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు ఎన్ని రకాల ఆడించాలో అన్ని రకాల ఆడిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రజల మనోభావాలతో పెట్టుకుంటే.. తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలంతా ఒక కన్నేసి ఉంచాలని చంద్రబాబు అన్నారు. `నిజాయితీగా ఉన్నందునే నన్నేమీ చేయలేకపోయారు. నేనెవరికీ భయపడను.. తప్పు చేసిన వారెవ్వరినీ వదలను అంటూ చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `దేశంలో ఎస్సీలకు భద్రత లేదు, మహిళలకు రక్షణ లేదు. బ్యాంకులు దోచుకుని విదేశాలకు వెళ్లినవారిపై ఎందుకు చర్యలు లేవు? అవినీతి పరులను ప్రధాని తన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత భాజపాకు లేదా? నేనేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని..విభజన హామీలే నెరవేర్చమంటున్నా`అని చంద్రబాబు అన్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చూసి తట్టుకోలేక పోయారని, అప్పటి నుంచి మనపై పగ పెంచుకున్నారన్నారు. నా కన్న అనింటిలో అనుభవం తక్కువ అనుభవం ఉన్న... మోడీని రాష్ట్రం కోసమే పొగిడానన్నారు. కొంతమందికి కొని కొన్ని లెక్కలు ఉంటాయని, రాష్ట్రం కోసం పది మెట్లు దిగైనా సాధించుకోవాలని మోడీని పొగిడానన్నారు. మన పోరాటంలో మొదటిగా నిన్న ధర్మపోరాట దీక్ష చేసానని, ఈ నెల 30వ తేదిన తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోడీ మాట్లడిన మాటలు గుర్తుచేస్తామన్నారు.