చంద్రబాబు ఎన్టీఆర్ ను అవమానించడం లేదు

Wed Nov 14 2018 07:00:01 GMT+0530 (IST)

తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ కోసం తాకట్టు పెడుతున్నారని రాష్ట్ర మంతా కోడై కూస్తుంటే... మీరు చంద్రబాబు ఎన్టీఆర్‌ను అవమానించడం లేదంటారేంటి? అని అనుకుంటున్నారా? అసలు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినపుడు సగం సచ్చిపోయింది. రైతులను - వ్యవసాయాన్ని నాశనం చేసినపుడు మరింత సచ్చిపోయింది. 2014లో అధికారం చేపట్టాక చంద్రబాబు అవినీతి తలుపులు బార్లా తెరిచినపుడు పూర్తిగా పోయింది. ఎన్టీఆర్ ఏ సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో అందులో ఒక్క సిద్ధాంతం కూడా ఆ పార్టీ ఇపుడు పాటించడం లేదు. అలాంటపుడు అది ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం ఎలా అవుతుంది.ఎన్టీఆర్ నడిపిన తెలుగుదేశం సిద్ధాంతాలు ఉద్దేశాలు వేరు. చంద్రబాబు సిద్ధాంతాలు - ఉద్దేశాలు వేరు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు పేదోడి ఆకలి తీర్చడం - రైతుకు వెలుగును ఇవ్వడం. చంద్రబాబు తెలుగుదేశం కులం - అవినీతి - వ్యాపారం అనే మూలస్థంభాలపై  నిలబడి ఉంది. కాబట్టి అది ఇపుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీయే కాదు. అది చంద్రబాబు తెలుగుదేశం సీటీడీపీ. దాన్ని కాంగ్రెస్ తో తాకట్టు పెట్టి బాబు తన సిద్ధాంతాల్లో ఒకటైన వ్యాపారం చేస్తున్నాడు. అలాంటపుడు దానివల్ల ఎన్టీఆర్ కు ఎందుకు అవమానం జరుగుతుంది? ఎన్టీఆర్ ఆత్మ ఎందుకు క్షోభకు గురవుతుంది?

సో... మీకు ఆ బెంగ అక్కర్లేదు. ఇపుడు ఉన్నవి సీటీడీపీ -టీటీడీపీ ఈ రెండే. అవి ఎన్టీఆర్ వి కానేకాదు.