Begin typing your search above and press return to search.

ఏపీలో రాష్ట్రపతి పాలన..?

By:  Tupaki Desk   |   16 Nov 2018 6:49 AM GMT
ఏపీలో రాష్ట్రపతి పాలన..?
X
ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ మారుతుందా..అక్కడ ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా రాష్ట్రపతి పాలన వస్తుందా..అలాగే కనిపిస్తున్నాయి అక్కడి పరిస్దితులు. విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతపై కత్తులతో దాడి సంఘటన రాష్ట్రపతి పాలనకు ఓ కారణంగా చెబుతున్నారు. దీని కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ రాష్ట్రంలోకి రావడానికి వీలు లేదంటూ జారీ చేసిన ఉత్తర్వులు కూడా మరో కారణంగా చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన రెడ్డిపై దాడి జరిగిన తర్వాత గవర్నర్ నరసింహన్ పోలిస్ ఉన్నతాధికారికి నేరుగా ఫోన్ చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆరా తీసారు. ఈ సంఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవర పెట్టింది. ప్రతిపక్ష నేతపై దాడి ఘటనను సాకుగా చూపిస్తు రాష్ట్రపతి పాలన తీసుకుని వస్తారని చంద్రబాబు నాయుడే ప్రకటించారు. ఆ తర్వాత అనేక సభలు - అధికార సమవేశాలలోను రాష్ట్ర పతి పాలన అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఆయనలోని భయాన్ని బహిర్గతం చేస్తోందని తెలుగుదేశం నాయకులే అంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు - సానుభూతి పరులు - కాంట్రాక్టర్లపై ఐటి దాడులు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు.

తాజాగా తెలంగాణ‌లో జరుగుతున్న ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్‌ తో చేతులు కలపడం జాతీయ స్దాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలనుకోవడవం కమలానాథులకు ఆగ్రహం తెప్పిస్తోంది. చంద్రబాబు నాయుడిని అన్నీ వైపుల నుంచి దాడులు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తానే స్వయంగా కేంద్రానికి ఆయుధాన్ని ఇచ్చారు. ఆ ఆయుధమే సీబీఐపై నిషేధం. చంద్రబాబు నాయుడిపై దాడికి అన్నీ అస్త్రాలు ఉపయోగిస్తున్న బీజేపీకి సీబీఐపై నిషేధం విధించడం ఓ బ్రహ్మాస్త్రంగా మారుతుందంటున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం - కేంద్ర సంస్ధలను నిషేధించడం వంటివి ప్రజాస్వామ్యంలో క్షేమకరం కాదంటూ ప్రభుత్వాన్ని డిస్మీస్ చేసే అవకాశం కేంద్రానికి ఉందంటూ పరిశీలకులు చెబుతున్నారు. ఈ రెండు కారణాలతోను ఆంధ్రప్రదేశ్‌ లో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా దాగి ఉండవచ్చునని మరికొందరూ అంటున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే బీజేపీని - వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ ను దోషులుగా చూపించి ప్రజలను సానుభూతి కొట్టేయాలన్నదే చంద్రబాబు నాయుడి చాణుక్యమని అదే ఈ వ్యవహారంలో ఓ ట్విస్ట్ అని అంటున్నారు.