Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు మార్కెటింగ్ టెక్నిక్ చెప్పిన బాబు

By:  Tupaki Desk   |   21 Nov 2017 4:56 AM GMT
త‌మ్ముళ్ల‌కు మార్కెటింగ్ టెక్నిక్ చెప్పిన బాబు
X
మార్కెటింగ్ లో అనుభ‌వం ఉన్న వారంద‌రికి తెలిసిన విష‌య‌మే ఇది. మార్కెటింగ్ ప్రాధ‌మిక సూత్రాల్లో ముఖ్య‌మైన‌ది ప్ర‌త్య‌ర్థి గురించి ప్ర‌స్తావ‌న తీసుకురాక‌పోవ‌టమే. నీ ప్రొడ‌క్ట్ ను మార్కెట్ చేయాల‌నుకున్న‌ప్పుడు నీ ప్రొడక్ట్ గురించి చెప్పాలే కానీ.. ప్ర‌త్య‌ర్థి ప్రొడ‌క్ట్ ను ప్ర‌స్తావించ‌ట‌మంటే నీ ప్రొడ‌క్ట్ ను నీకు నువ్వే నాశ‌నం చేసుకున్న‌ట్లు అని చెబుతారు. నీ బ‌లాన్ని చెప్పాలే కానీ.. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌హీన‌త‌ను అదే ప‌నిగా ప్ర‌స్తావించ‌టం ఏ మాత్రం మంచిది కాదంటారు.

ఇంచుమించే ఇదే వ్యూహానికి తెర తీశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్ ను ఉద్దేశించి తెలుగు త‌మ్ముళ్ల‌తో నిర్వ‌హించిన టీడీపీ వ్యూహ‌ర‌చ‌న క‌మిటీ స‌మావేశంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర నేప‌థ్యంలో తెలుగు త‌మ్ముళ్లు ప‌లువురు ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శ‌ల మీద విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అదే ప‌నిగా ప్ర‌త్య‌ర్థి మీద విమ‌ర్శ‌లు చేయ‌టం.. ప్ర‌త్య‌ర్థి పేరును ప్ర‌స్తావించ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న వాద‌న‌ను వినిపించారు చంద్ర‌బాబు. మార్కెటింగ్ మేనేజ‌ర్ అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు జ‌గ‌న్ పాద‌యాత్ర మీద త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. విప‌క్ష నేత జ‌గ‌న్ ను జ‌న‌మే మ‌ర్చిపోయార‌ని.. అలాంటి వ్య‌క్తిని ప్ర‌జ‌ల‌కు మీరెందుకు గుర్తు చేస్తారంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. జ‌గ‌న్ అనుకొని వారి కుటుంబ స‌భ్యులు వేరే వారి ఫోటోల్ని పెడుతున్న‌ట్లుగా బాబు వ్యాఖ్యానించారు.

అలాంటి వ్య‌క్తి గురించి మీరెందుకు మాట్లాడాలి? మ‌ర్చిపోయిన వ్య‌క్తి గురించి మాట్లాడి మ‌ళ్లీ గుర్తు చేయ‌కండంటూ పార్టీ నేత‌ల‌తో బాబు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. జ‌గ‌న్ వాద‌న‌ల్ని కోర్టులు కూడా ఒప్పుకోవ‌టం లేద‌న్న బాబు.. ఆయ‌న కుట్ర‌లు విఫ‌ల‌మువ‌తున్న‌ట్లుగా అభివ‌ర్ణించారు.

అమ‌రావ‌తిపై గ్రీన్ ట్రెబ్యున‌ల్‌ కు వెళితే.. జ‌గ‌న్ అండ్ కోకు అక్క‌డా చుక్కెదురు అయ్యిందంటూ ఆరోపించారు. టీడీపీ వ్యూహ‌ర‌చ‌న క‌మిటీ ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఇటీవ‌ల చీఫ్ విప్ ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా త‌మ్ముళ్లు స‌రికొత్త హిత‌బోధ చేశారు. బాబు చెప్పిన తాజా రూల్‌ త‌మ్ముళ్ల‌కేనా.. త‌న‌కు కూడా వ‌ర్తిస్తుందో చంద్ర‌బాబు క్లారిటీ ఇస్తే బాగుంటుంద‌ని చెప్పాలి.