Begin typing your search above and press return to search.

ఇండియా డిజిటల్ పితామహుడు చంద్రబాబు!!

By:  Tupaki Desk   |   1 Oct 2016 7:01 AM GMT
ఇండియా డిజిటల్ పితామహుడు చంద్రబాబు!!
X
సుయ్యి అంటే చాలు నాదొక బూరె అనే రకం చంద్రబాబు. ఇండియాలో డెవలప్ మెంట్ కు సంబంధించిన ఏ టాపిక్ మాట్లాడినా అందుకు తానే కారణం అంటున్నారాయన. హైదరాబాద్ అన్న పదం ఎక్కడైనా వినిపిస్తే చాలు.. హైదరాబాద్ ను డెవలప్ చేసింది నేనే - సాఫ్టువేర్ తెచ్చింది నేనే అంటూ మొదలుపెడతారాయన. సత్య అని పొరపాటున ఎవరైనా పలికారనుకోండి... మైక్రోసాఫ్టు సీఈవో సత్య నాదెళ్ల ఆ స్థాయికి రావడం కారణం నేనే - నా స్ఫూర్తితోనే ఆయన సాఫ్టువేర్ ఫీల్డును ఎంచుకున్నారని చెబుతారు చంద్రబాబు. ఇలా ఒకటా రెండా... అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది, ఐకే గుజ్రాల్ ను ప్రధాన మంత్రిని చేసింది కూడా తానేనని చెబుతారు చంద్రబాబు. తాజాగా ఆయన మరో డెవలప్ మెంట్ కు తానే పిల్లర్ నని ప్రకటించారు.

ఇండియాలో డిజిటల్ విప్లవానికి కారణం తానేనని చెప్పారు. గతంలో దేశంలో బ్యాండ్ విడ్త్ సమస్య తీవ్రంగా ఉండేదని తానే దాన్ని గుర్తించానన్నారు. ఈ విషయాన్ని అప్పటి ప్రధాని వాజ్‌పేయికి వివరించానన్నారు. దీంతో వాజ్‌ పేయి జశ్వంత్‌ సింగ్ అధ్యక్షునిగా ఒక కమిటీ వేశారని.. ఆ తర్వాతే టెలికామ్ కంపెనీలకు సంబంధించిన డి- రెగ్యులరైజేషన్ ప్రారంభమైందని చెప్పారు. శుక్రవారం విజయవాడలో జరిగిన డిజిటల్ ఇండియా సదస్సులో మాట్లాడిన చంద్రబాబు ఈ సంగతి చెప్పుకొచ్చారు.

కాగా ఏపీలో ఫైబర్ గ్రిడ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో 15ఎంబీపీఎస్ స్పీడ్‌ తో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. కేబుల్ ద్వారా అన్ లిమిటెడ్ ఛానల్స్ - మూడు ఫోన్లను కేవలం 149 రూపాయలకే ఇస్తామన్నారు. అయితే... నెల రోజుల్లో ఇస్తాం.. రెండు నెలల్లో ఇస్తాం అని చాలాకాలంగా చెబుతున్నా ఇంతవరకు అతీగతీ లేదు. ఇప్పుడు తాజాగా డెడ్ లైన్ వారం రోజులకు తీసుకొచ్చారు. మరి ఈసారైనా మాట నిలుపుకొంటారో లేదో చూడాలి. లేదంటే... రిలయన్సు జియో ఇప్పటికే రూరల్ ఏరియాలను కూడా రీచ్ అయిపోవడంతో ఫైబర్ గ్రిడ్ అవసరం లేదంటారో మరి.