Begin typing your search above and press return to search.

మున‌గ‌ట‌మే కాదు.. అంద‌రిని ముంచేసిన బాబు!

By:  Tupaki Desk   |   20 May 2019 4:52 AM GMT
మున‌గ‌ట‌మే కాదు.. అంద‌రిని ముంచేసిన బాబు!
X
మోడీ మామూలోడు కాద‌న్న మాట‌ను అదే ప‌నిగా చెబుతుంటారు రాజ‌కీయ నాయ‌కులు.. ఒక సెక్ష‌న్ పాత్రికేయులు. మామూలోడు కాద‌న్న మాట‌ను వారు య‌ధాలాపంగా అస్స‌లు చెప్పారు. ఆయ‌న గెలుపు కోసం దేనికైనా తెగిస్తారు. తాను ప్ర‌ధాని హోదాలో ఉన్నాన‌న్న విష‌యాన్ని కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ప్ర‌ధాని ప‌ద‌విలో ఉన్న వారు కొన్ని ప‌రిమితులు వారిని అడ్డుకుంటూ ఉంటాయి. వాటిని అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా దాటి వెళ్లేందుకు ఆయ‌న ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌రు.

ఈ త‌ర‌హా ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కోవాలంటే ఊహించ‌నంత ప్ర‌జాభిమానం.. అంతుకు మించిన దూకుడు చాలా అవ‌స‌రం. కానీ.. ఎన్డీయే ప్ర‌త్య‌ర్థి యూపీఏను చూస్తే.. మోడీని ఎదుర్కోనే స‌త్తా ఉన్నోళ్లు ఏ ఒక్క‌రు క‌నిపించ‌రు. మోడీ సంగ‌తి త‌ర్వాత‌.. షా మాదిరి అవ‌స‌రానికి త‌గ్గ తెలివిని.. తెగింపును ప్ర‌ద‌ర్శించే నేత‌లు క‌నిపించ‌రు.

ఇలాంటి వేళ‌.. యూపీఏతో రీక‌న్ స్ట్ర‌క్ చేసే బాధ్య‌త‌ను బాబు మీద వేసుకోవ‌టం క‌నిపిస్తుంది. మోడీని ఎదుర్కొనేందుకు మూప్పొద్దుల మీడియా మైకుల ముందు అదే పనిగా విమ‌ర్శ‌లు చేయ‌టంతో స‌రిపోదు. ఊహించ‌ని రీతిలో మంత్రాంగం ఉండాలి. ముచ్చ‌మ‌ట‌లు పోసే ప్లానింగ్ ఉండాలి.

కానీ.. అదేమీ యూపీఏ క‌నిపించ‌దు. మోడీని ఎదుర్కోవ‌టం ఈ రోజున అంత తేలికైన విష‌యం కాద‌న్న నిజాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌ర్చిపోవ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే కాదు.. ఈ రోజున మ‌రిన్ని భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను సైతం ఇరుకున ప‌డేసేలా చేసింద‌ని చెప్పాలి.

ఇప్పుడు ఎవ‌రినైతే నోటికి వ‌చ్చిన‌ట్లుగా చంద్ర‌బాబు తిట్టేస్తున్నారో.. ఐదేళ్ల క్రితం అదే మోడీతో జ‌త క‌ట్టి గెలుపును సొంతం చేసుకున్నార‌న్న విష‌యం గుర్తు ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి హోదాలోనే ఆయ‌న ఊహించ‌ని రీతిలో విజ‌యాన్ని అందుకోవ‌టం వెనుక ఛ‌రిష్మా ఒక్క‌టే స‌రిపోదు. అంత‌కు మించిన మంత్రాంగం చాలా అవ‌స‌రం. అది త‌న‌లో ఎంత ఉంద‌న్న విష‌యాన్ని ఫ‌లితాల రోజున ప్ర‌పంచానికి అర్థ‌మ‌య్యేలా చేశారు.

అలాంటి మోడీని ఎదుర్కోవ‌టానికి బాబు సిద్ధం కావ‌టం ఒక ఎత్తు అయితే.. చీలిక‌లు పీలిక‌లుగా మారిన యూపీఏ భాగ‌స్వామ్య ప‌క్షాలు.. ప‌వ‌ర్ కోసం పాకులాడే ప‌క్షాలు కొన్నింటిని న‌మ్ముకొని మోడీని ఏదేదో చేసేస్తామ‌న్న భావ‌న క‌లిగేలా వ్య‌వ‌హ‌రించినా.. తాజాగా విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ మోడీ ఛ‌రిష్మాకు ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి.

అదే స‌మ‌యంలో.. బాబుకు ఓట‌మి త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. సొంత రాష్ట్రంలో.. సొంత ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకోలేని బాబు మోడీని ఏదో చేద్దామ‌ని బ‌య‌లుదేర‌టం ఒక త‌ప్పు అయితే.. ఇప్పుడు ఆ త‌ప్పున‌కు జ‌ట్టు కట్టిన ప‌క్షాలు సైతం రానున్న రోజుల్లో ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు. ఏమైనా.. బాబు లెగ్గుతో యూపీఏ ఇప్పుడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి వెళ్లింద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎగ్జిట్ పోల్స్ వాస్త‌వ రూపం దాలిస్తే.. యూపీఏ క‌కావిక‌లం కావ‌ట‌మే కాదు.. బాబు మంత్రాంగాన్ని న‌మ్ముకున్న వారికి రానున్న రోజుల్లో చుక్క‌లు క‌నిపించ‌టం ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.