లోకేష్ భవిష్యత్ కోసమే చంద్రబాబు దీక్షలా.?

Thu Feb 14 2019 13:53:40 GMT+0530 (IST)

దీక్షలతో దుమ్మురేపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఎన్నికలు దగ్గరపడడంతో ఈ దీక్షల లిస్ట్ ఇప్పుడు చాలా ఎక్కువుగా ఉంది. ఇప్పటికే నల్ల చొక్కాలతో కేంద్ర తీరుపై నిరసన తెలుపుతున్న చంద్రబాబు నిన్నటికి నిన్న ఢిల్లీల్లో ధర్మపోరాట దీక్ష చేశారు. త్వరలో అమరావతిలో కూడా ఒక దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజం చెప్పాలంటే దీక్షల వల్ల సమస్య పరిష్కారం అవుతుందా అంటే కాదనే చెప్పాలి. కేసీఆర్ అంతటోడే.. ఎన్నోరోజులు కష్టపడితే కానీ తెలంగాణ రాలేదు. తెలంగాణలో ప్రతీ ఒక్కరూ కలిసి వచ్చారు. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు తప్ప ఇంకెవ్వ రూ కనపడడం లేదు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబే కనబడనివ్వడం లేదు. అయితే.. ఈ దీక్షలు ప్రత్యేక హోదా కోసం కాదు.. చంద్రబాబు తనయుడు లోకేష్ కోసమే అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.లెక్కప్రకారం.. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. ఆ తర్వాత తన బాధ్యతలు అన్నీ లోకేష్ కు అప్పగిస్తారు. తెలంగాణలో జరిగింది అదే. ఇప్పటికే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. మంత్రులుగా ఎవరు ఉండాలో అన్నీ కేటీఆర్ డిసైడ్  చేశారని టాక్. ఇలా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి లోకేష్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేదే చంద్రబాబు ప్లాన్. అందుకోసమే.. ఇలా దీక్షలతో ప్రజల్లో హోదా సెంటిమెంట్ ని రగిల్చి అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ముందుస్తుగా ఊహించలేదు కాబట్టే.. జగన్ దాదాపు పదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉండిపోయారు. అలాంటి పరిస్థితి లోకేష్ కు రాకూడదనే ఇలా ఇప్పుడు స్పీడ్ పెంచారు చంద్రబాబు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో  సీనియర్ నాయకులకు కాకుండా వారి వారసులకు ఈసారి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కన్పిస్తుంది. దీనిద్వారా లోకేష్ చుట్టూ ఒక బలమైన వారస వర్గాన్ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.