Begin typing your search above and press return to search.

చిరంజీవే అసలు దొంగ అంటున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   4 Feb 2016 7:42 AM GMT
చిరంజీవే అసలు దొంగ అంటున్న చంద్రబాబు
X
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పటి సంగతులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అప్పటి చిరంజీవికి ఇప్పటి చిరంజీవికి తేడా ఏంటో అందరికీ తెలుస్తుంది. సామాజిక న్యాయం - మార్పు - కాపులకు బీసీ రిజర్వేషన్.... ఒకటా రెండా ఎన్నో మాటలు చెప్పిన చిరంజీవి అందులో ఒక్కదానికోసం కూడా కనీస ప్రయత్నం చేయలేదు. తన పార్టీని కాంగ్రెస్ లో కలిసేసి తాను కేంద్ర మంత్రి పదవులను తీసుకుని హాయిగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం కోల్పోగానే ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవిని పూర్తిగా అర్థంచేసుకున్నవారు, చిరంజీవి వ్యతిరేకులు ఆయన గురించి చెప్పేమాట ఒక్కటే.. రాజకీయ మోసగాడు. అలాంటి చిరంజీవి కొద్దికాలంలో పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేరు. కానీ, రీసెంటు కాపు రాజకీయాలు ఉద్ధృత రూపం దాల్చిన తరువాత మాట్లాడకపోతే కాపు నేతగా తాను ఎక్కడ వెనకబడిపోతానో అనుకుంటూ ఆయన కూడా బయటకొచ్చారు. చంద్రబాబుపై నిప్పులు కక్కుతూ లేఖ రాశారు. అయితే... గురివింద లాంటి చిరంజీవి పెద్దపెద్ద మాటలు చెబితే ఎవరు ఊరుకుంటారు. అందుకే చంద్రబాబు కూడా అంతేస్థాయిలో రెస్పాండయ్యారు. ''ముందు నీకు ఉన్న మచ్చ చూసుకోవయ్యా చిరంజీవీ'' అంటూ కడిగిపారేశారు. దీంతో చిరంజీవి నుంచి సమాధానమే లేదు.

కాపుల రిజర్వేషన్ ల విషయంలో చిరంజీవి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దానికి బాబు కౌంటరేశారు. సామాజిక న్యాయం - కాపులను బిసీల్లో చేరుస్తాం అంటూ పార్టీ పెట్టిన చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసారని, కానీ ఏనాడూ ఆ విషయమై పార్టీని నిలదీయలేదని, తనకు మాత్రం లేఖ రాస్తారని చంద్రబాబు నేరుగా విమర్శలు గుప్పించారు. దీంతో చిరంజీవి నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనవసరంగా కెలుక్కుంటే తనకే నష్టమని గుర్తించిన చిరు దీనిపై ఇంకేం మాట్లాడడం మానేశారు.