Begin typing your search above and press return to search.

నంద్యాల నుంచి బ‌రిలో దిగ‌నున్న చంద్ర‌బాబు?

By:  Tupaki Desk   |   26 Sep 2017 3:57 PM GMT
నంద్యాల నుంచి బ‌రిలో దిగ‌నున్న చంద్ర‌బాబు?
X
2019లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నంద్యాల నుంచే పోటీ చేస్తారా..? అందులో బాగంగానే నంద్యాల ఉప ఎన్నికలను అంత సవాల్‌గా తీసుకున్నారా? నంద్యాల అభివృద్దికి రూ. 1300 కోట్లు ఇందుకే కేటాయించారా?..టీడీపీ సీనియర్‌ నేతలు - మాజీ మంత్రి ఎన్‌ ఎండి ఫరూక్‌ - ఉర్దూఅకాడ‌మీ ఛైర్మన్‌ గా నౌమాన్‌ ను నియమించి ముస్లిం మైనార్టీ ఓట్లను దగ్గరు చేర్చుకునేందుకే ఈ రాజకీయ ఎత్తులు వేసి ఉంటారా ? త‌ర‌చుగా నంద్యాల గురించి వాకాబు చేస్తూ తరచు అభివృద్ది పనులపై సమీక్షలు జరుపుతుండ‌టం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మంత్రి నారాలోకేష్‌ ను కప్పం నుంచి పోటీ చేయించి తాను నంద్యాల నుంచి పోటీ చేసేందుకు చంద్ర బాబు ఆలోచన ఉన్నట్లు ఉండి ఉండవచ్చునని పలువురు రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు.

2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పార్టీ కార్యక్రమాలను స్పీడు పెంచారు. నంద్యాల - కాకినాడ ఉప ఎన్నికల తర్వాత ఊపుమీదున్న బాబు ఇదే తరహా ఊపును వచ్చే ఎన్నికల దాక తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు మొదలుకొని - నాయకులు - కార్యకర్తల దాక పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజిగా గడిపేలా ఆదేశిస్తున్నారు. ఇంటింట‌ టిడిపి కార్యక్రమం పేరుతో గ్రామాల వెంబడి నేతలను తిప్పుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సన్నర ఉన్పప్పటికీ మద్యలోనే ఎన్నికలు రావచ్చునని అంచనా వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నాయకులకు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఏ క్షణానైనా ఎన్నికలు వస్తే గెలిచే విధంగా కార్యక్రమాలు ఉండాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ ను తాను నిలబడే కుప్పం నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు. అక్కడ తన అనుచరులతో పాటు పార్టీ బలంగా ఉండడంతో లోకేష్‌ గెలుపు సులభంగా ఉంటుందని బాబు ఆలోచించినట్లు తెలుస్తోంది. లోకేష్‌ ను కుప్పంకు పోటీ చేయించి నంద్యాల నుంచి తాను పోటి చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లు సమాచారం.

టీడీపీ కంచుకోటగా నంద్యాల ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి పోటీ చేయాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. అందులో బాగంగానే ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో నంద్యాల అభివృద్దికి దాదాపు 1300 కోట్ల అభివృద్ది పనులు మంజూరు చేసినట్లు సమాచారం. రోడ్ల విస్తరణ - వేలల్లో ఇళ్లు మంజూరు - సంక్షేమ పథకాలు కూడా నంద్యాలకు పెద్ద ఎత్తున కేటాయించారు. రాజకీయంగా నాయకుల నుంచి అసంతృప్తిలు రాకుండా ఒక వైపు - నంద్యాల నియోజకవర్గంలో ముస్లింలను దగ్గర చేసుకునేందుకు మాజీ మంత్రి ఎన్‌ ఎండి ఫరూక్‌ కు ఎంఎల్‌ సి చేసి మండలి చైర్మన్‌ గా చేశారు.అలాగే మరో నేత నౌమాన్‌ కు కీలకమైన ఉర్దూ అకాడమీ చైర్మన్‌ గా కేటాయించారు.అంతేకాకుండా భూమా కుటుంబం నుంచి అఖిల ప్రియకు మంత్రి పదవి కేటాయించారు. నంద్యాలలో బలమైన నేతగా ఉన్న వైకాపా నేతగా ఉన్న గంగుల ప్రతాప్‌ రెడ్డిని టిడిపిలోకి చేర్చుకోవడం కూడా ఇందులో బాగమేనని అంటున్నారు.ఇక నంద్యాలలో మరో నేతతో పాటు - ఎంపి ఎస్‌ పివై రెడ్డి అల్లుడుకు కూడా ఎందులోనైనా న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే భూమా భ్రహ్మానందరెడ్డికి మరో చోట అవకాశం కల్పించవచ్చునన్న వాదనలు వస్తున్నాయి. ఈ విష‌య‌మై పార్టీలో సీరియ‌స్‌ గానే చ‌ర్చ జ‌రుగుతోంద‌ని అంటున్నారు.