Begin typing your search above and press return to search.

బాబూ...పార్టీ అంటే వన్ మ్యాన్ షో కాదు

By:  Tupaki Desk   |   14 March 2019 6:08 AM GMT
బాబూ...పార్టీ అంటే వన్ మ్యాన్ షో కాదు
X
రాజకీయ పార్టీ అంటే ఎంతో మంది నాయకులు - ఎంతో మంది కార్యకర్తల సమాహారం. ఒక పార్టీ నిలబడిందంటే ఆ పార్టీ అధినేత ఒక్కడి గొప్పతనమే అనుకుంటే పొరపాటే.... కాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరు గత కొద్దిరోజులుగా ఇందుకు భిన్నంగా ఉంది. పార్టీలో ఎవ్వరితోను సంప్రదింపులు గాని - చర్చలు గాని జరపడంలేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు తన అధినేతపై కాస్త కినుకతో ఉన్నారని గుసగుసలు వినుపిస్తున్నాయి. కేంద్రం ఎన్నికల తేదా ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి టిక్కెట్ల లొల్లి తలనొప్పిగానే మారింది. గతంలో ఏకులా ఉండే నాయకులు ఇప్పుడు మేకులై గుచ్చుకుంటున్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడి స్వయంక్రుతమే అన్న విమర్శలు లేకపోలేదు.

నారా లోకేష్ ను మంత్రిని చేసేందుకు చేసిన ప్రయత్నాలలో పార్టీలో కొందరి నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. కొంత మంది నాయకులు మాత్రం రాష్ట్రం విడిపోయిన వెంటనే కాకుండా మరి కొద్ది రోజులు ఆగితే బాగుటందని సలహా ఇచ్చరట. అలాంటి వారిని చంద్రబాబు నాయుడు తన దరిదాపులలోకి కూడా రాకుండా దూరం పెట్టారని వినికిడి. గత కొద్ది రోజులుగా బాబు పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించినట్లు కూడా లేదు. అయితే ఎప్పుడైతే టిక్కెట్లపై అసమ్మతి సెగ రగిలిందో వారిని సమదాయించడానికి అన్నట్లు నేడు అంటే గురువారం పార్టీలోని అందరిని పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరు కావాలని హఠాత్తుగా ఆదేశించారు. ఇలా వన్ మ్యాన్ ఆర్మిగా వ్యవహరింస్తున్న చంద్రబాబుకు అసమ్మతి - పార్టీలో కాస్త పట్టున్న నాయకులు అవంతి శ్రీనివాస్ లాంటి వారు పార్టీని వదలి వెళ్లడం బాబును ఇరుకున పెడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుడడంతో బాబుకు తన దగ్గర ఏకులా ఉండే నాయకులు మేకులా మారి తనకు ఎదురు చెప్పడం జీర్ణించుకో లేనకపోతున్నారని - వారిని సమదాయించలేక - వలసలను ఆపలేక - తికమకపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా కాకుండా ముందు నుంచి కూడా పార్టీలో బడా నాయకులతో నియంతలా కాకుండా - వారిని కలుపుకుని పోయుంటే బాబుకు నేడు ఈ పరిస్థితి దాపురించేది కాదని వారు అంటున్నారు.