Begin typing your search above and press return to search.

వచ్చే ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్న బాబు!

By:  Tupaki Desk   |   21 Feb 2019 8:12 AM GMT
వచ్చే ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్న బాబు!
X
*తనకు దక్కనిది.. ఎవరికీ దక్కకూడదు’ అనే డైలాగును ‘మగధీర’ సినిమాలో విలన్ చెప్తుంటాడు. అదే అనే రీతిలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అనంతరం ఎలాగో తన ప్రభుత్వం రాదని చంద్రబాబు డిసైడ్ అన్నట్టున్నాడు. అందుకే ఆచరణ సాధ్యం అవుతుందా.. కాదా అని ఆలోచించకుండా హామీలతో ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నాడని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారంలోకి వచ్చేందుకు ఏ పార్టీ అయినా ఎలాంటి హామీలైన ఇవ్వడం కొత్తేమీ కాదు.. కాకపోతే హామీలు బహిరంగంగా ప్రకటించే ముందే ఆచితూచి వ్యహరించాల్సి ఉంది. దేశంలోనే తాను 40 ఇయర్స్ పాలిటిక్స్ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు హామీల విషయంలో ఎల్లలుదాటి ప్రవర్తించడం ఆందోళనకు గురిచేస్తోంది..

ఏపీలో ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం వచ్చినా తాను ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఇప్పుడు జీవోలు - ఉత్తర్వులను విడుదల చేయడం చంద్రబాబుకే చెల్లించింది. ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలలు ఉన్నాయనగా చంద్రబాబు ఉద్యోగులకు మభ్యపెట్టేందుకు మద్యంతర భృతి వచ్చే జూన్ నెల నుంచి ఇస్తామంటూ ప్రకటించేశారు. ఇందుకు సంబంధించిన జీవోలు కూడా తాజాగా విడుదల చేసేశారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా 35వేల నుంచి 45వేల పెంచుతామంటూ హామీ ఇచ్చారు. ఈ హామీలన్ని రాబోయే ప్రభుత్వం అమలు చేయాలని జీవోలు కూడా ఇచ్చేస్తున్నారు.

ఎలాగే రాబోయేది తన ప్రభుత్వం కాదని భావిస్తున్న చంద్రబాబు నాయుడు వచ్చే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు కలిగించేలా ఇలాంటి ప్రణాళికలను రచిస్తున్నాడన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.. ఎన్నికల సమయంలో హామీలిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్ల కాలంలో ఎందుకు వీటిని అమలు చేయలేదని ఉద్యోగ - విద్యార్థి సంఘాల నాయకులు నిలదీస్తున్నారు. ఏదిఏమైనా చంద్రబాబునాయుడు తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే రీతిలో రాబోయే ప్రభుత్వానికి ఆర్థిక నిల్వలు లేకుండా ప్రయత్నిస్తున్నారన్న విమర్శ అనలిస్టుల నుంచి వ్యక్తమవుతోంది. ఇలాగైనా వచ్చే ప్రభుత్వంపై కసి తీర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.