Begin typing your search above and press return to search.

టీడీపీలో ముందస్తు బెంగ

By:  Tupaki Desk   |   22 April 2017 7:26 AM GMT
టీడీపీలో ముందస్తు బెంగ
X
దేశ రాజకీయాల్లోనే కాదు, ఏపీ రాజకీయాల్లోనూ ముందస్తు మాట వినిపిస్తోంది. దీంతో కనీసం ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు రావడం గ్యారంటీ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే... ముందస్తు మాట వింటేనే చాలు టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. ముందస్తు ఎన్నికలు తమకు అచ్చిరావని... గతంలో అలిపిరి ఘటనలో చంద్రబాబు చావు తప్పించుకున్నప్పుడు ఆ సెంటిమెంటు వర్కవుట్ అవుద్దని ముందస్తు ఎన్నికలుకు వెళ్లి దెబ్బతిన్న సంగతి గుర్తు చేస్తున్నారు. అంతేకాదు... రాష్ర్టంలో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని.. కొంచెం టైముంటే నాలుగు మంచి పనులు చేసి జనాలు మొఖం చూపించొచ్చు కానీ ఇప్పటికప్పుడు ఎన్నికలకు వెళ్తే దెబ్బయిపోవడం ఖాయమని అంటున్నారు.

పైగా కొత్తగా మంత్రి పదవులు వచ్చినవారు ఇంకా ఉన్నది రెండేళ్లేనని.. ముందస్తు పేరుతో అందులో ఆరేడు నెలలు మింగేస్తే తమ పరిస్థితి ఏంటని అంటున్నారు. అలాగే ఒకే నియోజకవర్గంలో టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నవారు కూడా ఇప్పటి నుంచే ఖర్చు పెట్టాలా.. లేదంటే కాస్త ఆగాలా అన్న విషయంలో క్లారిటీగా లేరట. కొత్తగా నియోజకర్గాలు పెరుగుతాయో లేదో తెలియని పరిస్థితి దీంతో.. ఏ ఏరియాలో ఖర్చు చేయాలి.. ఏ ఏరియాలో ప్రచారం చేసుకోవాలన్న విషయంలో గందరగోళం ఉందని... చంద్రబాబు నియోజకవర్గాల పెంపుపై క్లారిటీ ఇచ్చి ముందస్తు ఎన్నికల విషయంలో స్పష్టత ఇవ్వాలని అంటున్నారు.

సీట్లు పెరగకపోతే మాత్రం చంద్రబాబుకు చుక్కలు కనిపించడం ఖాయమని తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలోనే సీట్ల కొట్లాట ఓ రేంజిలో ఉంది. రేపు ఎన్నికల వేళ సీట్లు పెరగకుంటే రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. మరి చంద్రబాబు ఈ కష్టాలన్నీ ముందే కొనితెచ్చుకుంటారా అన్నది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/