Begin typing your search above and press return to search.

జగన్ హామీల హైజాక్.. బాబు కుటిల నీతి

By:  Tupaki Desk   |   25 March 2019 7:58 AM GMT
జగన్ హామీల హైజాక్.. బాబు కుటిల నీతి
X
ఏపీ ఎన్నికలు ఇప్పుడు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఎలాగైనా గెలవాలన్న కసితో ఇబ్బడిముబ్బడిగా అమలు సాధ్యమా కాదా అని ఆలోచించకుండా హామీలిస్తున్నారు. జనరంజక ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. జగన్ కంటే రెండాకులు ఎక్కువ చదివిన చంద్రబాబు రెట్టింపు వరాలను ప్రకటిస్తున్నారు.

తాజాగా చంద్రబాబు ప్రజలను ఆకర్షించేందుకు గొప్ప వరాన్ని ప్రకటించారు. ఏకంగా రెండు వేలకు పెంచిన పెన్షన్ ఇప్పుడు మరో వెయ్యి జతపర్చి మూడు వేల రూపాయిలు ఇస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. వైసీపీ హామీలతో పోటీపడాలనే చంద్రబాబు ఈ సరికొత్త హామీని సంధించారు.

వైసీపీ ప్లీనరీలో మొదట తాను అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న వెయ్యి పింఛన్ ను రెండు వేలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో అలెర్ట్ అయిన బాబు మొన్న జనవరి నుంచి ఏపీ ప్రజలకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నారు. దీంతో జగన్ తాజా ఎన్నికల ప్రచారంలో తాను మూడు వేల వరకు పెంచణ్ పెంచుతానని హామీ ఇచ్చారు. దీంతో ఎక్కడ వెనుకబడి పోతానోనని చంద్రబాబు తాజాగా 3వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం విశేషం. ఈరోజు టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఇదే విషయాన్ని పార్టీ స్పష్టం చేశారు. పెన్షన్ మూడు వేల వరకు పెంచుతామని చెప్పుకొచ్చారు.

నాలుగు రోజుల క్రితం టీడీపీ మేనిఫెస్టో విడుదల కావాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రజాకర్షక పథకాలు చూసి చంద్రబాబు ఆగారు. నాలుగు రోజులుగా వైసీపీ హామీలు లీక్ చేయిస్తూ టీడీపీ క్యాష్ చేసుకుంటోంది. ఇప్పటికే ఉద్యోగుల పీపీఎస్ ను రద్దు చేస్తామనే లీక్ ఇప్పటికే ఇచ్చేశారు. ఇక తాజాగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు లీక్ ఇచ్చాడు. వైసీపీకి ధీటుగా పెన్షన్ పెంచుతామని వెల్లడించారు.ఇలా వైసీపీ హామీలను జగన్ దొంగచాటుగా తెలుసుకొని ప్రకటిస్తూ దొంగదెబ్బ తీస్తున్నాడన్న చర్చ సాగుతోంది.

* జగన్ ను దెబ్బకొట్టడానికేనా?
ఏపీ సీఎం చంద్రబాబు తన శక్తిసామార్థ్యాల కంటే ప్రతిపక్ష జగన్ హామీలు, శక్తిని ట్రాప్ చేయడానికి, కాపీ కొట్టి ఆయన్ను దెబ్బతీయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ హామీలు ప్రకటించడానికి రెడీకాగానే బాబు వాటిని ప్రకటిస్తూ హామీలిస్తున్నారు. లీకుల ద్వారా వైసీపీని ట్రాప్ చేసేందుకు ఇలా లీకులు ఇస్తున్నారన్న చర్చ సాగుతోంది. పెన్షన్లను ఇప్పటికే జగన్ నుంచి కాపీ కొట్టిన బాబు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ ను వాయిదా వేసి ఎన్నికల వేల మైండ్ గేమ్ ద్వారా వైసీపీ ని ట్రాప్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు తాజా ఎత్తుగడలపై ఎలా స్పందిస్తారో చూడాలి.