Begin typing your search above and press return to search.

చంద్రబాబు వెళ్లిపోగానే లాగి పెట్టి కొట్టాడు

By:  Tupaki Desk   |   20 March 2019 1:26 PM GMT
చంద్రబాబు వెళ్లిపోగానే లాగి పెట్టి కొట్టాడు
X
అసమ్మతి లందు మాచర్ల అసమ్మతులు వేరు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ. ఒకప్పుడు చంద్రబాబుని చూస్తేనే కార్యకర్తలు - నాయకులు వణికిపోయేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆయనమందు కామ్‌ గా ఉన్నా.. ఆయన వెళ్లిపోగానే మళ్లీ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక మాచర్ల అసమ్మతి వర్గం అయితే ఒకరిపై ఒకరు చేసుకునేంతవరకు పరిస్థితి వెళ్లిపోయింది.

మాచర్ల సీటు అంజిరెడ్డికి కేటాయించారు చంద్రబాబు. అంజిరెడ్డి కూడా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు స్థానికంగా ఇన్నాళ్లు పార్టీకి కొమ్ముకాసిన చలమారెడ్డి తనకు ఎమ్మెల్యే సీటు కావాలని అడిగారు. చంద్రబాబు ఇవ్వలేదు. దీంతో.. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటిని - అలాగే మాచర్ల అభ్యర్థి అంజిరెడ్డిని ఓడిస్తామని చలమారెడ్డి వర్గం అసమ్మతికి దిగింది. దీంతో.. అంజిరెడ్డి వర్గాన్ని - చలమారెడ్డి వర్గాన్ని తీసుకుని రాయపాటి సాంబశివరావు అమరావతి వచ్చారు. చంద్రబాబు ఇద్దరిని కూర్చోబెట్టి.. కాస్త కూల్ చేసి.. ఈసారి అంజిరెడ్డి పోటీ చేస్తారని.. ఆయనకు సహకరించాలన చలమారెడ్డికి చెప్పి ఆయన వెళ్లిపోయారు. చంద్రబాబు ఉన్నంతసేపు కామ్‌ గా ఉన్న చలమారెడ్డి ఆయన వెళ్లిపోగానే రెచ్చిపోయారు. అంజిరెడ్డిని చేయి చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు గొడవ జరిగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని బయటకు గెంటేశారు.