Begin typing your search above and press return to search.

ఆధార్ వద్దా.. రద్దు చేసుకోండిలా.?

By:  Tupaki Desk   |   6 Dec 2018 11:12 AM GMT
ఆధార్ వద్దా.. రద్దు చేసుకోండిలా.?
X
మనిషి పుట్టినా ఆధార్.. చచ్చాక డెత్ సర్టిఫికెట్ కు ఆధార్.. ఇలా ప్రస్తుత సమాజంలో అన్ని పనులకు ఆధార్ ఉంటే నే ఐడెంటిటీ.. మనిషి చేతులకు ఉన్న వేలి ముద్రల నుంచి కంటి రెజినీ వరకు అంతా స్కాన్ చేసి ఆన్ లైన్ లో పెట్టిన కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టులు బాగా నే బుద్దిపెట్టాయి.

వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందంటూ చాలా మంది ఆధార్ తప్పనిసరి పై సుప్రీం కోర్టు లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యం లో ఆధార్ తప్పనిసరి కాదంటూ సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో కేంద్రం దిగివచ్చి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వ్యక్తుల ఆధార్ డేటాను ప్రైవేటు సంస్థలు వాడరాదని ఆదేశాలిచ్చింది. ఆధార్ చట్టంలోని 57వ సెక్షన్ ను సైతం ధర్మాసనం కొట్టివేసింది. ఈ పరిణామంతో ఇక నుంచి బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్ కు ఆధార్ ను లింక్ చేయడం తగ్గించేశారు.

కేంద్రం ఆదేశాలు అమల్లోకి వస్తే ఆధార్ కార్డు అవసరం లేదనుకున్న వాళ్లు అందరూ దాన్ని రద్దు చేసుకోవచ్చు. లబ్ధిదారులు గతంలో ఇచ్చిన బయోమెట్రిక్ తో పాటు డేటాను వెనక్కి తీసుకోవడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఆధార్ ను వెనక్కి తీసుకోవడం పై ఆధార్ ను పర్యవేక్షించే యూ డీ ఏ ఐ కొత్త ప్రతిపాదన చేసింది. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా తమ ఆధార్ ను విత్ డ్రా చేసుకోవచ్చని.. 6 నెలలోపు ఈ పని పూర్తి చేస్తామని యూ డీ ఏ ఐ అధికారులు తెలిపారు. అయితే దీన్ని అందరికీ వర్తింప చేయాలని కేంద్ర న్యాయ శాఖ కోరుతోంది.