రాంగ్ రూట్లో వెళితే ఇక పగిలిపోద్ది

Fri Jan 11 2019 12:07:26 GMT+0530 (IST)

వివిధ పనులు ఆఫీసులకు తొందరగా వెళ్లాలంటే అందరూ రాంగ్ రూట్ లను ఎంచుకుంటారు. అలా ఇన్నాల్లు ఈజీగా వెళ్లిన వాహనదారులకు కేంద్రం ఇక చెక్ పెడుతోంది. రాంగ్ రూట్ లో వెళితే మీ టైర్లు పగిలిపోయే ప్లాన్లు వేసింది. మొదట ఫుణెలో అప్లై చేసిన ఈ ప్లాన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు నోయిడాలో అమలు చేస్తున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగించేందుకు కేంద్రం నిర్ణయించింది.రాంగ్ రూట్ వినియోగదారులకు షాకిచ్చేందుకు కేంద్రం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన టైర్ కిల్లర్లను మొదట ఫుణెలో ఏర్పాటు చేసింది. అక్కడ సక్సెస్ అయ్యింది. ఈ టైర్ కిల్లర్ల ఏర్పాటును ప్రజలు స్వాగతించారు.రాంగ్ రూట్ చోదకులు వెళ్లడానికి భయపడ్డారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ అక్కడ విజయవంతమైంది. రోడ్డుకు అడ్డంగా ఈ టైర్ కిల్లర్లను ఏర్పాటు చేస్తే సరైన రూట్ వస్తే అవి ఆటోమేటిక్ గా కిందకు వంగి వాహనాదారులకు దారి ఇస్తాయి. రాంగ్ రూట్ లో రాగానే పదునైన పళ్లు బయటకు పొడుచుకు వస్తాయి. దీంతో రాంగ్ రూట్ లో వెళ్లే వాహనాల టైర్లు పంచర్ అవుతాయి. కొత్త టైర్లే కొనుక్కోవాల్సి వస్తుంది. దీనివల్ల వేల రూపాయలకు పైగా నష్టం. అందుకే ఫుణెలో వాహనదారులు రాంగ్ రూట్ అంటేనే జడుసుకుంటున్నారు.

ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో తాజాగా నోయిడాలో టైర్ కిల్లర్లను రోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలకు విస్తరించేందుకు యోచిస్తున్నారు. ఇక లెక్క చేయకుండా రోడ్లపై రాంగ్ రూట్ వెళ్లే వాహనదారులు ఇక కొత్త టైర్లను కొనుక్కోవాల్సిందే...