Begin typing your search above and press return to search.

కోడెల‌కు స‌న్ షాక్ త‌ప్ప‌దా..!

By:  Tupaki Desk   |   31 Aug 2016 6:07 AM GMT
కోడెల‌కు స‌న్ షాక్ త‌ప్ప‌దా..!
X
ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌ - టీడీపీ సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద‌రావుకి ఆయ‌న కుమారుడే ఎర్త్ పెట్టేలా క‌నిపిస్తున్నాడ‌న్న గుస‌గుస‌లు ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి. దాదాపు ఏపీ అధికార పార్టీలో మంత్రులు - ఎమ్మెల్యేల‌కి వాళ్ల ఫ్యామిలీల నుంచే పెద్ద సెగ త‌గులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఇలా ఫ్యామిలీ మేట‌ర్ కార‌ణంగా ఇద్ద‌రు మంత్రుల ప‌ద‌వుల‌కు ఎస‌రొచ్చేట్టుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఓ మంత్రి గారి భార్య‌ - బామ్మ‌రుదులు చేస్తున్న వ‌సూళ్లు - మ‌రో మంత్రిగారి పుత్ర‌ర‌త్నాల వెకిలి చేష్ట‌లు ఇప్ప‌టికే ఓ రేంజ్‌లో మీడియాలో విస్తృత ప్ర‌చారం పొంద‌డం తెలిసిందే. దీంతో ఆ ఇద్ద‌రు మంత్రుల త‌ల‌పై క‌త్తి వేలాడుతోంద‌ని టీడీపీ వ‌ర్గాల్లో టాక్‌!

ఇక‌, ఇప్పుడు తాజాగా అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల‌కు కూడా ఫ్యామిలీ నుంచే సెగ త‌గులుతోంది. కోడెల గ‌త చ‌రిత్ర ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయ‌న ఒకింత మౌనంగానే త‌న ప‌నితాను చేసుకుపోతున్నారు. అయితే, పాన‌కంలో పుడ‌క‌లా ఆయ‌న కుమారుడు శివ‌రామ‌కృష్ణ కోడెల‌ హ‌వా ఎక్కుగా ఉన్న న‌ర్సారావుపేట‌లో జ‌రిగే ప్ర‌తి విష‌యంలోనూ వేలు పెడుతున్నాడ‌ట‌. కాంట్రాక్ట‌ర్ల‌ను ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో బెదిరించ‌డం - ప‌నిని బ‌ట్టి రేటు నిర్ణ‌యించి వ‌సూళ్లు చేయ‌డంపై విప‌క్షానికి చెందిన ఓ ప‌త్రిక‌లో ప్ర‌ముఖంగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే, వీటిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎదురు ఆరోప‌ణ‌లు చేసిన కోడెల‌.. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌పై మాత్రం మౌనం వ‌హించారు.

అంతేకాదు, దీనిలో కోడెల కూడా చిక్కుకునే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. తాజాగా వైసీపీ నేత .నరసరావుపేట కు చెందిన నల్లపాటి రామచంద్రప్రసాద్ కు చెందిన కేబుల్ టీవి కార్యాలయంపై ఇటీవ‌ల దాడి జ‌రిగింది. త‌మ‌కు వ్య‌తిరేకంగా ప్ర‌సారాలు చేస్తావా అంటూ కోడెల అనుచ‌రులు కొంద‌రు సిబ్బందిని కూడా కొట్టిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో రామచంద్ర‌ప్ర‌సాద్ - కోడెల‌ - ఆయ‌న కుమారుడిపై హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిష‌న్‌ ను విచారించిన కోర్టు.. కోడెల‌ - ఆయ‌న కుమారుడు స‌హా గుంటూరు ఎస్పీ మ‌రికొంద‌రికి నోటీసులు పంపింది.

అదేవిధంగా త‌న పిటిష‌న్‌ లో రామచంద్ర‌ప్ర‌సాద్ పేర్కొన్న‌ట్టు.. దాడి త‌ర్వాత స్థానిక పోలీసులకు కోడెల కానీ, ఆయ‌న కుమారుడు కానీ ఫోన్ చేశారేమో ప‌రిశీలించాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డిన కోర్టు.. ఆయా స్టేష‌న్ల‌కు వ‌చ్చిన కాల్ డేటాను భ‌ద్రం చేయాల‌ని టెలిపోన్ సంస్థలను ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఈ విష‌యం చిలికి చిలికి గాలి వాన అయితే.. కోడెల ప‌రిస్థితి ఏంట‌నేది రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఏదేమైనా ఫ్యామిలీ వ‌ల్ల కొంద‌రు నేత‌లు మాత్రం చిక్కుల్లో ప‌డిపోతున్నారనేది వాస్త‌వం.