Begin typing your search above and press return to search.

నైట్ క్ల‌బ్‌ లో కాల్పులు..అమెరికాలో మ‌ళ్లీ క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   8 Nov 2018 12:33 PM GMT
నైట్ క్ల‌బ్‌ లో కాల్పులు..అమెరికాలో మ‌ళ్లీ క‌ల‌క‌లం
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రోమారు కాల్పుల మోత వినిపించింది. కాలిఫోర్నియాలో ఇవాళ కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకుంది. థౌజెండ్ ఓక్స్ ప్రాంతంలోని ఓ బార్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బోర్డ‌ర్‌ లైన్ బార్ అండ్ గ్రిల్‌ లో జ‌రిగిన ఈ కాల్పుల్లో ప‌లువురు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మొత్తం 12 మంది మృతిచెందారు. బుల్లెట్ గాయాలు త‌గిలిన వారిని స్థానిక ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. వెన్‌ తురా కౌంటీ షెరిఫ్‌ ఆఫీస్‌ డిప్యూటీ కూడా బార్‌ లోనే ఉన్నారని ఆయన కూడా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. బార్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు ఎవ‌రూ వెళ్ల‌కూడ‌దంటూ పోలీసులు ఆదేశించారు. ఈ కాల్పుల్లో ఎవరైన ప్రాణాలు కోల్పోయారా అనే విషయానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాలేజీ కౌంటీ మ్యూజిక్ నైట్ జ‌రుగుతున్న స‌మ‌యంలో బారులో కాల్పులు జ‌రిగాయి. ఓ సాయుధుడు సుమారు 30 రౌండ్లు కాల్పులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ కాల్పుల్లో క‌నీసం మ‌రో ప‌ది మంది గాయ‌ప‌డ్డారు. గ‌న్‌ తో బార్‌ లోకి చొర‌బ‌డిన ఓ వ్య‌క్తి.. గేటు వ‌ద్ద బౌన్స‌ర్‌ ను కాల్చాడు. అనంత‌రం లోప‌లికి వ‌చ్చి స్మోక్ డివైస్‌ ల‌ను వాడాడు. డ్యాన్స్ ఫ్లోర్ మీద ఉన్న యువ‌త‌పై అత‌ను కాల్పులు జ‌రిపాడు. ఈ స‌మ‌యంలో వంద నుంచి రెండు వంద‌ల‌ మందికి పైగా బార్‌ లోనే ఉన్నట్లు సమాచారం. బార్‌ లో నుంచి తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనేక రౌండ్ల కాల్పులు త‌ర్వాత సాయుధుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. గ‌న్‌ తో చొరబడిన సదరు వ్యక్తి బార్‌ లో చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ప్ర‌స్తుతం అగ్నిమాపక దళాలు - అంబులెన్స్‌ లు ఘటనా స్థలంలో సేవ‌లు అందిస్తున్నాయి.

కాగా, ఈ బీతావ‌హ కాల్పుల గురించి ప్ర‌త్య‌క్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ పొగ వచ్చే గ్రెనేడ్లను బార్‌ లోకి విసిరేసి ఆ తర్వాత కాల్పులు జరపడం ప్రారంభించినట్లు వివ‌రించారు. రాత్రి 11.30 గంటల సమయంలో బార్‌ లోకి చొరబడిన ఓ వ్య‌క్తి తుపాకీతో కాల్చడం మొద‌లుపెట్టాడు. దాదాపు 30 రౌండ్లు తుపాకీ పేలినట్లుగా తాను భావిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్పటికీ గన్‌ షాట్స్‌ వినిపిస్తూనే ఉన్నాయి అని సదరు వ్యక్తి వాపోయాడు.