Begin typing your search above and press return to search.

ఇంకా బాబు ఇల్లు కూల్చలేదు... కానీ

By:  Tupaki Desk   |   23 Sep 2019 7:40 AM GMT
ఇంకా బాబు ఇల్లు కూల్చలేదు... కానీ
X
కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు నివాసంతో పాటు మరికొన్ని కట్టడాలను కూడా కూల్చివేసే పనిని సీఆర్డీఏ మొదలుపెట్టింది. ప్రస్తుతం పాతూరి గెస్ట్‌ హౌస్ నుంచి పనులు మొదలుపెట్టారు. అయితే ఈరోజు రేపటి కూల్చివేతల్లో చంద్రబాబు నివాసం ఉండదు.

చంద్రబాబు అద్దెకుంటున్న నివాసాన్ని ఖాళీ చేయాలని మూడు రోజుల కిందటే సీఆర్డీయే నోటీసులిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌ - ఫస్ట్‌ ఫ్లోర్‌ - స్విమ్మింగ్‌ పూల్‌ - ఫస్ట్‌ ఫ్లోర్‌ లోని డ్రెసింగ్‌ రూమ్‌ నిర్మించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఇంటి యజమానిగా లింగమనేని స్పందించారు. తాము నిర్మాణం చేపట్టే నాటికి సీఆర్‌ డీఏ లేదని - అందువల్ల అప్పటి పంచాయతీ అధికారుల అనుమతి తీసుకునే నిర్మాణం చేపట్టామని ఆయన తెలిపారు. అయితే ఆ వివరణతో తృప్తి చెందని అధికారులు ఇంటిని కూల్చివేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కరకట్టపై ఉన్న పాతూరి గెస్ట్‌ హౌస్‌ కు సంబంధించి 17 మీటర్ల ర్యాంప్‌ ను కూల్చివేస్తున్నారు. చంద్రబాబు అద్దెకు ఉన్న ఇంట్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ - ఫస్ట్‌ ఫ్లోర్‌ - స్విమ్మింగ్‌ పూల్‌ - ఫస్ట్‌ ఫ్లోర్‌ లోని డ్రెసింగ్‌ రూమ్‌ తదితరాల కూల్చివేత ప్రక్రియ కూడా త్వరలోనే మొదలవుతుందని సమాచారం.

కృష్ణా కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 31 కట్టడాలకు సీఆర్‌ డీఏ అధికారులు గతంలో నోటీసులిచ్చారు. వారిని పిలిపించి వాదనలు విన్నారు. వాదనలు విన్నాక 5 కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించి తుది నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో ఆ కట్టడాలను వారే కూల్చివేయాలని లేకపోతే సీఆర్‌ డీఏ చర్యలు తీసుకుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిలో శివస్వామి ఆశ్రమంలో ఉన్న 2 కట్టడాలు - ఆక్వాడెవిల్స్‌ పేరుతో ఉన్న ఒక కట్టడం - మరో 3 అంతస్తుల భవనం ఉన్నాయని సమాచారం.