Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మహాకూటమికి సీపీఎం తూట్లు.?

By:  Tupaki Desk   |   23 Sep 2018 9:06 AM GMT
కాంగ్రెస్ మహాకూటమికి సీపీఎం తూట్లు.?
X
తెలంగాణలో కాంగ్రెస్ కు సీపీఎం ఎర్త్ పెడుతోందట.. మహాకూటమిలోని పార్టీలకు బంపర్ ఆఫర్ ఇస్తోందట. ఇప్పటికే కోదండరాంకు - కాంగ్రెస్ కు పడకపోవడంతో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెరవెనుక పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.. కోదండరాంతో పాటు టీడీపీకి - సీపీఐ కూడా తమతో కలిసి రావాలని మినీ కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రమంతా పోటీచేద్దామని సీపీఎం స్కెచ్ గీస్తోందట..

సీపీఎం జాతీయ రాజకీయాల్లో అటు కాంగ్రెస్ కు - ఇటు బీజేపీకి వ్యతిరేకంగా సాగుతోంది. రెండు పార్టీల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందుకే రాష్ట్రంలో మహాకూటమి వేళ అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి ఏర్పాటు చేసినా.. సీపీఎం మాత్రం కలిసి రాలేదు.. పైగా జనసేన - బీఎల్ ఎఫ్ బహుజన సమితి పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అందుకే ఇప్పుడు మహాకూటమి ప్రతిష్టంభన వేళ సీపీఎం... కోదండరాం నుంచి మొదలు పెట్టి మిగతా అన్ని పార్టీలకు ఆహ్వానం పంపుతోందట..

నిజానికి తెలంగాణలో బలమైన టీఆర్ ఎస్ ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ బలం సరిపోదని మహాకూటమికి స్కెచ్ గీశారు. కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - కోదండరాంలు కలిసి ఏర్పడ్డారు. కానీ సీట్ల సర్దుబాటులో కోదండరాం పట్టువీడకపోతే కూటమి ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో కోదండరాం 25న సమావేశంలో బయటకు వస్తే అందిపుచ్చుకోవాలని సీపీఎం భావిస్తోంది. మిగతా పక్షాలను కూడా కాంగ్రెస్ ను వీడి రావాలని కోరుతోంది. కానీ మహాకూటమితో పోల్చితే సీపీఎం ప్రతిపాదించే మినీ కూటమి బలం చాలా స్వల్పం. సాధించే సీట్లు కూడా తక్కువే. అందుకే కాంగ్రెస్ తో జట్టు వీడి వచ్చేందుకు అటు టీడీపీ - సీపీఐ సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. కోదండరాం మాత్రమే అటూ ఇటూగా ఉన్నారట.. 25న గడిస్తే కానీ సీపీఎం ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది చెప్పలేం.