Begin typing your search above and press return to search.

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె..హుజూర్‌ న‌గ‌ర్ లో టీఆర్ ఎస్‌ కు సీపీఐ షాక్‌...!

By:  Tupaki Desk   |   9 Oct 2019 3:21 PM GMT
ఆర్టీసీ కార్మికుల స‌మ్మె..హుజూర్‌ న‌గ‌ర్ లో టీఆర్ ఎస్‌ కు సీపీఐ షాక్‌...!
X
ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల‌ను హుజూర్‌ న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక‌తో పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కూడా హీటెక్కిస్తోంది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప్ర‌భావం హుజూర్‌ న‌గ‌ర్ ఉపఎన్నిక మీద కూడా ఎంతో కొంత ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని తేలిపోయింది. ఈ స‌మ్మె ఎఫెక్ట్ హుజుర్‌ నగర్‌ లో సీపీఐ-టీఆర్ ఎస్‌ ల మధ్య చీలిక తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ జేఏసీ తాజాగా సోమాజిగూడ ప్రెస్‌ క్ల‌బ్‌ లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో... హుజూర్‌ న‌గర్ ఉప ఎన్నికల్లో తాము టీఆర్ ఎస్‌ కు మద్దతు ఇచ్చే అంశంపై సమీక్ష చేసుకుంటామని వారిని ఇచ్చారు. సిపిఐకి ఎప్పుడు ప్రజా పోరాటాలు... ప్రజా సమస్యలే కీలకమని ఆయన పేర్కొన్నారు. హుజూర్‌ న‌గర్ లో టిఆర్ ఎస్ కు మద్దతు తెలిపిన‌ప్పుడు ఆర్టీసీ సమ్మె నోటీసు మాత్రమే ఇచ్చిన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇక ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత మాత్రం సరైంది కాదని చాడ‌ ఎద్దేవా చేశారు. కార్మికులకు అండగా ఉంటామని ఉద్యోగాలు తీసేస్తాం అంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌ మాటల వింటే నవ్వు వస్తోందని.. గతంలో ఆయన చేసిన వాగ్దానాలు మరోసారి గుర్తుచేసుకోవాలని విమర్శించారు. ప‌క్క తెలుగు రాష్ట్ర‌మైన ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చేస్తోన్న ప‌నులను చూసి అయినా కేసీఆర్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద‌ని చాడ సూచించారు.

ఏదేమైనా నిన్న‌టికి నిన్న కేసీఆర్ సీపీఐ స‌పోర్ట్ కోసం టీఆర్ ఎస్ నాయ‌కుల‌ను ఆ పార్టీ నేత‌ల వ‌ద్ద‌కు పంపారు. సీపీఐ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ కు అలా స‌పోర్ట్ చేసిందో ? లేదో ? ఇప్పుడు వెంట‌నే యూట‌ర్న్ తీసుకుని పున‌రాలోచోచన చేస్తామ‌ని చెప్ప‌డంతో హుజూర్‌ న‌గ‌ర్ రాజ‌కీయం మ‌రింత హీటెక్కింది. ఏదేమైనా ఇటు ఉప ఎన్నిక‌... అటు ఆర్టీసీ స‌మ్మెతో తెలంగాణ‌లో రాజ‌కీయం రోజు రోజుకు ఆస‌క్తిగా మారుతోంది.