Begin typing your search above and press return to search.

బాబుపై సీపీఐ కామెంట్ అదిరిందిగా!

By:  Tupaki Desk   |   2 Sep 2017 6:41 AM GMT
బాబుపై సీపీఐ కామెంట్ అదిరిందిగా!
X
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర‌లో టీడీపీ అధికారంలోకి రావ‌డం, ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎం కావ‌డం, రాష్ట్ర పాల‌నా వ్వ‌వ‌హారాలు విజ‌య‌వాడ‌కు మారిపోవ‌డం... త‌దిత‌ర ప‌రిణామాల‌తో ఇప్పుడు అక్క‌డ ఓ కొత్త సంప్ర‌దాయం అమ‌ల్లోకి వ‌చ్చేసింది. త‌మ భూముల‌కు సాగు నీరు ఇచ్చిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి కృష్ణా డెల్టా రైతులు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ సంద‌ర్భాన్ని ఆస‌రా చేసుకుని అదేదో కృష్ణా డెల్టాకు చంద్ర‌బాబు వ‌చ్చిన త‌ర్వాతే సాగు నీరు వ‌చ్చిన‌ట్లుగా రైతులు సంబర‌ప‌డిపోతున్నార‌ని టీడీపీ అనుకూల మీడియా బాకాలు ఊదేసింది. ఇప్పుడు కృష్ణా డెల్టా రైతుల అవ‌తారం ఎత్తేందుకు టీడీపీ సిద్ధ‌మ‌వుతోంద‌ట‌.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థిని గెలిపించిన ప్ర‌జ‌ల‌కు త‌మ పార్టీ నేత‌లు కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు బ‌య‌లుదేర‌నున్నారంటూ ఆ పార్టీ నుంచి ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై విస్మ‌యం వ్య‌క్తం చేసిన వామ‌ప‌క్షాలు... నంద్యాల ఎన్నిక‌కు సంబంధించి ఎవ‌రు... ఎవ‌రికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి అన్న విష‌యాన్ని నిర్దారించేందుకు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌... నిన్న బెజ‌వాడ‌లో మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ... ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌కు సంబంధించి చంద్ర‌బాబు అండ్ కో నంద్యాల ప్ర‌జ‌ల‌కేమీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పాల్సిన అవ‌స‌ర‌మేమీ లేద‌ని, నంద్యాల ప్ర‌జ‌లే చంద్ర‌బాబు అండ్ కోకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సి ఉందని కూడా ఆయ‌న త‌న‌దైన శైలి వాద‌న‌ను వినిపించారు. ఈ వాద‌న‌కు ఆయ‌న కార‌ణాల‌ను కూడా స‌వివ‌రంగానే చెప్పుకొచ్చారు.

ఆ వివరాల్లోకి వ‌స్తే... *ఓటు రేటును రూ.300 నుంచి రూ.3 వేలకు పెంచిన చంద్రబాబు ధనబలంతో నంద్యాలలో గెలిచిన సంగతి అందరికీ తెలుసు. అలాంటిది మంత్రులు - ఎమ్మెల్యేలను పంపి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు చెబుతామనడం విడ్డూరంగా ఉంది. ఓటు రేటు పెంచినందుకు నంద్యాల ప్రజలే చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పాలి. 50 మంది ఎమ్మెల్యేలు - 20 మంది మంత్రులు - చోటా మోటా నాయకులు వందలాది మంది నంద్యాలలో మోహరించడంతోపాటు 10వేల పెన్షన్లు - రూ.వందల కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని ఎన్నికల్లో గెలిచారు. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు దురాశ తగ్గలేదు. ఇకనైనా వైఖరి మార్చుకోకపోతే ఆయనను ప్రజలు విశ్వసించరు’’ అని రామకృష్ణ త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబు అండ్ కోపై నిప్పులు చెరిగారు.