Begin typing your search above and press return to search.

రేవంత్ ఆరోప‌ణ‌ల‌పై బాబు విచార‌ణ చేయించాల్సిందే

By:  Tupaki Desk   |   22 Oct 2017 1:44 PM GMT
రేవంత్ ఆరోప‌ణ‌ల‌పై బాబు విచార‌ణ చేయించాల్సిందే
X
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి క‌ల‌క‌లం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌ కు చేరువ అవుతున్న రేవంత్‌... సొంత పార్టీకి చెందిన ఏపీ నేత‌ల‌ను ఇర‌కాటంలో పెట్టేలా కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో దోస్తీ నెర‌ప‌డం వ‌ల్ల‌...ఏపీ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు - ఏపీ మంత్రి ప‌రిటాల సునిత‌ - ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్‌ లాభ‌ప‌డ్డార‌ని రేవంత్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. తాజాగా సీపీఐ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. సొంత పార్టీకి చెందిన కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు చేసిన ఆరోప‌ణ‌ల‌పై బాబు ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

రేవంత్ ఆరోప‌ణ‌ల‌పై చంద్ర‌బాబు రియాక్ట‌యితే...ఏపీ నేత‌ల అక్ర‌మ కాంట్రాక్టులు వెలుగులోకి వస్తాయ‌ని నారాయ‌ణ‌ తెలిపారు. ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబానికి రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను - పరిటాల సునీత - పయ్యావుల కేశవ్ కుటంబాలకు బీర్ల ఫ్యాక్టరీ లైసెన్సుల విష‌యంలో బాబు మౌనం అనేక అనుమానాల‌కు తావిస్తోంద‌ని నారాయ‌ణ అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ వ్య‌వ‌హారాన్ని సొంత వ్య‌వ‌హారంగా చూడ‌లేమ‌ని చెప్పారు. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో బాబు డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌తో ఉన్నార‌ని ఆరోపించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు పోల‌వ‌రం - పులిచింత‌ల ప్రాజెక్టును వ్య‌తిరేకించిన బాబు ఇప్పుడు స‌మ‌ర్థిస్తున్నార‌ని నారాయ‌ణ‌ తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు చంద్ర‌బాబు వ్య‌తిరేక‌మ‌ని ఆరోపించిన నారాయ‌ణ‌...దీన్ని నిరూపించేందుకు సిద్ధ‌మ‌న్నారు. ఏపీలోని కార్పొరేట్ కాలేజీల్లో జ‌రుగుతున్న ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలో ప్ర‌భుత్వం స్పందించాల‌ని ఏపీ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ డిమాండ్ చేశారు.