Begin typing your search above and press return to search.

బెజ‌వాడ మెట్రోపై ముంద‌డుగే..వెన‌క‌డుగు లేదు

By:  Tupaki Desk   |   4 Sep 2015 6:22 PM GMT
బెజ‌వాడ మెట్రోపై ముంద‌డుగే..వెన‌క‌డుగు లేదు
X
కేంద్రం వ‌ద్ద‌ని అంటోంది. బాబు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాడు. ఒక‌రికి ఖేదం. మ‌రొక‌రికి మోదం. ఇదీ విజ‌య‌వాడ మెట్రో రైల్ ప‌రిస్థితి.ఇంత‌కీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో కూడా ఖ‌చ్చితంగా చెప్ప‌లేకుండా ఉన్నాం. ఇప్ప‌టికే డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది..త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌నుకుంటున్న టైంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు సుముఖంగా లేద‌న్న క‌థ‌నాలు రావ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌ కు గుర‌య్యారు.

సీఎం చంద్ర‌బాబు ఈ రోజు విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం మెట్రో ప్రాజెక్టుల విష‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ భేటీలో మెట్రోరైల్ నిపుణుడు శ్రీధ‌ర‌న్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బ‌బు మాట్లాడుతూ విజయవాడ మెట్రో రైల్ పనులను 2018 నాటికి పూర్తి చేయాలన్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. మెట్రో రైలుకు నిధుల కొరత లేదని, జ‌పాన్‌ కు చెందిన‌ జైకా సంస్థ ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిపారాయ‌న‌.ప్రతి నెలా మెట్రో రైలు ప్రగతిపై నివేదికలు ఇవ్వాలని కోరారు.ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఈ ప్రాజెక్టు పై వేగంగా పురోగతి సాగించాలని సూచించారు.

ఇదిలా ఉంటే విజ‌య‌వాడ‌లో మెట్రో రైల్ ఏర్పాటుకు వ‌య‌బులిటీ లేద‌ని కేంద్రం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబు ఈ విష‌యంలో చాలా ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళ్లాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నా కేంద్రం సాయం లేకుండా బాబు డ్రీమ్ సాధ్య‌మౌతుందా అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.​