Begin typing your search above and press return to search.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రెడీ..అభ్య‌ర్థులే లేర‌ట‌

By:  Tupaki Desk   |   4 Jun 2018 12:15 PM GMT
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రెడీ..అభ్య‌ర్థులే లేర‌ట‌
X
అవాక్క‌వకండి. ఆశ్చ‌ర్యపోకండి. ``ప్ర‌స్తుతం సాఫ్ట్‌ వేర్ ప‌రిశ్ర‌మ‌లో ఉద్యోగాలు టైట్ ఉన్నాయి...ఎంద‌రో ఆశ‌గా ఉన్నారు...వేలాది మంది అభ్య‌ర్థులు సిద్ధంగా ఉన్నారు. ఈ స‌మ‌యంలో సరైన అభ్య‌ర్థులు లేరంటారా? `` అంటూ మండిప‌డ‌కండి. నిజంగా నిజ‌మే. సాఫ్ట్‌ వేర్ కొలువులు సిద్ధంగా ఉన్నాయి. కానీ స‌రైన అభ్యర్థులే లేరు. ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదు... ప్రముఖ ఐటీ రంగ సంస్థ టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని. ఔను. ఈ టెక్ దిగ్గ‌జం ఢిల్లీలో ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

ఈ కాలంలో 90శాతం మంది కుర్రోళ్లు ఏం చదువుకున్నావ్ అంటే ఇంజినీరింగ్ అని ఠక్కున చెబుతారు. మరి ఉద్యోగం చేస్తున్నావా అంటే మాత్రం మౌనమే సమాధానం ఇలా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న ఐటీ స్టూడెంట్స్ లో 94శాతం మంది నిరూప‌యోగం అని తేల్చేశారు. 2020 నాటికి సైబర్ సెక్యూరిటీ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది ఐటీ నిపుణులు అవసరం అవుతారని.. అయితే అందుకు తగ్గ నైపుణ్య‌వంతులు దొరకటం లేదని సీపీ గుర్నానీ తెలిపారు. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి స్కిల్ పీపుల్ కావాలంటున్నారు. ఢిల్లీ లాంటి నగరంలో ఓ స్టూడెంట్ 60శాతం మార్కులు స్కోర్ చేసినా ఇంగ్లీష్ మాట్లాడలేకపోవటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇంటర్వ్యూలకు వస్తున్న వారికి సైతం ఇంగ్లీష్ పై పట్టులేకపోవటంతోపాటు కనీస పరిజ్ణానం కూడా ఉండటం లేదన్నారు. ఇది రాబోయే రోజుల్లో ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకొచ్చారు. ఐటీ స్టూడెంట్స్ లో స్కిల్ లేకపోతే.. రోబోలతోనే నెట్టుకురావాల్సి ఉంటుందన్నారు.

నాస్కామ్ రిపోర్ట్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని.. ఇది ఇండియా ఐటీ ఇండస్ట్రీకే అతి పెద్ద సవాల్ అన్నారు. ఇండియాలోని టాప్ 10 ఐటీ కంపెనీలన్నీ కూడా కేవలం 6శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో నడుస్తున్నాయన్న కఠోర వాస్తవాన్ని వెల్లడించారు. మిగతా వాళ్లు అందరూ కూడా గ్రాడ్యుయేట్లు, ఎంసీఏ, ఎంబీఏ లాంటి చదువులతో ఐటీ రంగంలోకి వచ్చారన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు మెరుగైన శిక్షణ - కొత్తగా రిక్రూట్ చేసుకునే వారికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద టెక్ మహీంద్ర క్యాంపస్ లోని 5 ఎకరాల్లో టెక్ అండ్ లెర్నింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.