Begin typing your search above and press return to search.

గుండె కోత లేకుండా సింపుల్ గా సర్జరీ

By:  Tupaki Desk   |   7 Oct 2015 9:24 AM GMT
గుండె కోత లేకుండా సింపుల్ గా సర్జరీ
X
హృద్రోగాలు పెరిగిపోతున్నాయి... గుండె కవాటాలు, రక్తనాళికలు మూసుకుపోవడం వల్ల వచ్చే సమస్యల నుంచి కాపాడేందుకు చేసే బైపాస్ సర్జరీలు వేల సంఖ్యలో జరుగుతున్నాయి. ఓపెన్ హార్ట్ సర్జరీల సంగతీ చెప్పనవసరం లేదు. నూటికి పది మంది గుండెల్లో స్టంట్లుంటున్నాయి. ప్రాణానికి ఆధారమైన గుండెకే శస్త్రచికత్స అంటే ఆ రోగి, కుటుంబానికి కూడా అది విజయవంతంగా పూర్తయ్యేవరకు ఆందోళనే..... ఇప్పుడు ఇలాంటి ఆందోలనను కొంతవరకు తగ్గించేలా క్లిష్టమైన గుండె సర్జరీలకు ప్రత్యామ్నాయంగా కేవలం అతుకువేసి గుండెలో రంథ్రాలు మూసివేయగలిగే నాళం ఆకృతిలోని రివిట్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని కాథెటర్ గా పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్టాది మందికి మేలు చేసే ఇది వైద్యశాస్త్రంలో పెద్ద డెవలప్ మెంట్ గానే చెప్పుకోవాలి.

బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, హార్వర్డ్ యూనివర్సిటీలోని విస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయొలాజికల్లీ ఇన్‌స్పైర్డ్ ఇంజనీరింగ్ సంస్థల పరిశోధకులు మరికొందరు కలిసి దీనిపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. జంతువులపై వీరు పరిశోధనలు చేస్తూ గుండె రంధ్రాలను అతుకు(రివిట్) ద్వారా మూసివేయడానికి వీలుగా కాథెటర్‌ రూపొందించారు. బైపాస్ సర్జరీ అవసరం లేకుండా గుండె రంధ్రాలకు ఈ అతుకు వేయడానికి అల్ట్రా వయొలెట్ కిరణాలను ప్రసరింపజేస్తారు.

ఈ కొత్త విధానంలో రోగి మెడ లేదా, తొడ వద్ద ఉండే నరాల నుంచి అతుకు వేయాల్సిన కాథెటర్ ను గుండెలో ఉన్న రంథ్రం వరకు పంపిస్తారు. సరిగ్గా రంధ్రం ఉన్న ప్రాంతానికి మాసిక చేరుకోగానే.. కాథెటర్‌కు రెండువైపులా ఉన్న రేకులు విచ్చుకునేలా చేస్తారు. ఒక వైపు గుండెరంధ్రం లోపలికి... రెండోవైపున గుండె గోడ బయటకు విచ్చుకుని రివిట్ ను కదలకుండా చేస్తాయి. అప్పుడు కేథటర్‌లో అల్ట్రా వయోలెట్ కిరణాలు పంపిస్తారు. దానిపై ఉన్న జిగురు పొరను కరిగించి అతుక్కునేలా చేస్తారు. క్రమేపీ ఈ కేథటర్ చుట్టూ గుండె కణజాలం పెరిగి రంధ్రం దానికదే మూసుకుపోతుంది. ఆ తరువాత అతుకు కూడా గుండె కణజాలంలోనే కరిగిపోతుంది. దానికోసం వాడే పదార్థం కూడా కణజాలంలో కరిగిపోయేలాంటిదే వినియోగిస్తారు. ఈ విధానం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకపోగా గుండెకు కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు.