Begin typing your search above and press return to search.

కొత్త చ‌ర్చ: తెలంగాణలో ఉప ఎన్నిక‌లు

By:  Tupaki Desk   |   13 March 2018 4:48 PM GMT
కొత్త చ‌ర్చ: తెలంగాణలో ఉప ఎన్నిక‌లు
X
తెలంగాణ‌లో మరో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ శాసనసభ సభ్యత్వం రద్దుతో ఉప ఎన్నికలు రావొచ్చనే సంకేతాలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నికలు రావ‌డం ఖాయ‌మ‌ని ఇటు అధికార‌ - అటు ప్ర‌తిప‌క్ష పార్టీలు న‌మ్ముతుండ‌టం గ‌మ‌నార్హం.

అన్ని పార్టీలు 2019 సాధారణ ఎన్నికలకు రెడీ అవుతున్న ఈ టైమ్ లో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చర్చనీయాంశమైంది. ఈ రెండు చోట్ల ఉపఎన్నిక తప్పదా అనేది హాట్ టాపిక్ అయ్యింది. సాధారణ ఎన్నికలకు ఏడాదే సమయం ఉంది. కానీ ఇప్పటికే రెండు సీట్లు ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. ఈ విషయాన్ని ఈసీకి తెలిపింది. స్పీకర్ నిర్ణయంపై కోమటిరెడ్డి - సంపత్ లు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే టైమ్ లో అధికార పార్టీ - సహా మిగతా పార్టీలు బై పోల్ తప్పవనే చెప్తున్నాయి. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం స్పీకర్ దే తుది నిర్ణయం. కోమటిరెడ్డి - సంపత్ కుమార్ ల విషయంలో స్పీకరే స్వయంగా తీసుకున్న డెసిషనే ఫైనల్ అవుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఇలాంటి ఘటనల విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు తప్పవనే ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే నల్గొండ - ఆలంపూర్ లో ఎన్నికలు జరుగుతాయని అధికార పార్టీ వర్గాలు చెప్పడమే కాకుండా ఉప ఎన్నికలకు సంబంధించిన కసరత్తు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. నల్లగొండ - మహబూబ్ నగర్ జిల్లాల మంత్రులతో పాటు సీనియర్ నేతలను అలర్ట్ చేసినట్లు సమాచారం. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ ఎస్‌ చూస్తోంది. సాధారణ ఎన్నికల ముందే మంచి మైలేజ్ కొట్టాలనేది అధికార పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. మొత్తంగా ఎన్నిక‌లకు ముందే ఈ ఎన్నిక హాట్ టాపిక్ అయింది.