Begin typing your search above and press return to search.

కాశ్మీర్‌ లో టెన్ష‌న్‌..చిక్కుకుపోయిన తెలుగువారు

By:  Tupaki Desk   |   28 May 2017 5:31 PM GMT
కాశ్మీర్‌ లో టెన్ష‌న్‌..చిక్కుకుపోయిన తెలుగువారు
X
దేశ స‌రిహ‌ద్దు రాష్ట్రమైన కాశ్మీర్‌ లో నెలకొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల కార‌ణంగా ప‌లువురు తెలుగువారు తీవ్ర ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. కాశ్మీర్ లో నిన్న జరిగిన ఎన్‌ కౌంటర్ లో హిజ్ బుల్ ముజాహిదీన్ కమాండర్ మరణించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. ఈ చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య‌గా ఉగ్ర‌వాదులు దాడుల‌కు తెగ‌బ‌డ‌వ‌చ్చ‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పర్యాటకులు రాష్ట్రం విడిచి వెనుదిరిగి వెళుతున్నారు. అయితే కర్ఫ్యూ అమలులో ఉండటంతో కాశ్మీర్ లోయలో పలువురు టూరిస్టులు చిక్కుకున్నారు. అలా చిక్కుకున్న టూరిస్టులలో పలువురు తెలుగువారు ఉన్నట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా....ఎన్‌ కౌంటర్ లో కమాండర్ సబ్జార్ భట్ మరణించడంతో హిజ్ బుల్ ముజాహిదీన్ వార‌స‌త్వం కోసం వెతుకుతోంది. భ‌ట్ వారసుడిగా రియాజ్ అహ్మద్ నైక్కూను నియమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఒక వర్గానికి చెందిన మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది.

ఇదిలాఉండ‌గా...జ‌మ్ముకాశ్మీర్‌ లో రాళ్ల దాడి నుంచి త‌ప్పించుకునేందుకు జీపున‌కు ఓ మ‌నిషిని క‌ట్టేసిన ఘ‌ట‌న‌ను ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ స‌మ‌ర్థించారు. కాశ్మీర్‌లాంటి డ‌ర్టీ వార్ జ‌రిగే ప్ర‌దేశాల్లో ఇలాంటి కొత్త కొత్త ఎత్తుగ‌డ‌ల‌ను అనుస‌రించ‌డంలో ఎలాంటి త‌ప్పు లేద‌ని బిపిన్ స్ప‌ష్టంచేశారు. ``వాళ్లు మా సైనికుల‌పై రాళ్లు, పెట్రోల్ బాంబులు విసురుతుంటే.. కామ్‌గా వేచి చూసి చావ‌మ‌ని చెప్ప‌లేం క‌దా?`` అని బిపిన్ ప్ర‌శ్నించారు. ``ఆందోళ‌న‌కారులు రాళ్లు వేసే కంటే ఆయుధాల‌ను వాడి ఉంటే నేను ఇంకా చాలా సంతోషంగా ఉండేవాడిని`` అని ఆర్మీ చీఫ్‌ అన్నారు.