హవ్వ.. అది నోరేనా అసలు

Sat Feb 23 2019 22:15:51 GMT+0530 (IST)

వైసీపీ అధినేత జగన్ లండన్ వెళ్లాడు. జగన్ లండన్ వెళ్లిన దగ్గరనుంచి ఎలాగొలా ఆయన టూర్ ని బద్నా చేయాలనుకున్న టీడీపీ వర్గాలకు ఇప్పటివరకు సరైన అవకాశం దొరకలేదు. లండన్ నుంచి జగన్ గురించి ఎలాంటి సమాచారం రావడం లేదు. దీంతో.. ఏదో ఒక ఆరోపణ చేయకపోతే కష్టం అనుకున్న టీడీపీ నాయకులు.. అసలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రంగంలోకి దిగారు. అసలు జగన్ లండన్ వెళ్లింది బ్లాక్ మనీ కోసం అనీ.. లండన్ లో జగన్ విజయ్ మాల్యాని కలిశాడని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఒక హోటల్లో జగన్ మాల్యా అంతా కలిసినట్లు తమ దగ్గర సమాచారం ఉందని ప్రకటించారు.ఆరోపణలు చేయడం తప్పుకాదు. కానీ కాస్తో కూస్తో సహేతుకంగా ఉండాలి. వినేవాడు నమ్మేట్లు ఉండాలి. ఈరోజుల్లో సమాచారం చాలా ఫాస్ట్ గా సర్కులేట్ అవుతుంది. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. అలాంటిది లండన్ లో జగన్ మాల్యాని కలిస్తే బయటి జనానికి తెలీకుండా ఉంటుందా. ఒకవేళ తెలీదు అనుకుందాం. జగన్ గురించి లండన్ ప్రజలకు తెలీదని అనుకుందాం. కానీ మాల్యా గురించి తెలుసుకదా. అసలు మాల్యా లండన్ లో ఉన్నాడన్న విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పించే లండన్ లో ప్రవాస భారతీయులు. అదీగాక.. అసలు మాల్యా అనే వ్యక్తి బయట కన్పిస్తే మనవాళ్లు వెంటాడుతున్నారు. అలాంటి మాల్యా జగన్ దగ్గరకు వెళ్లి ప్రశాంతంగా కూర్చుని మాట్లాడేంత సీన్ లేదు. దీంతో.. అసలు టీడీపీ నాయకులది నోరా ఇంకా ఏమైనా అని విమర్శిస్తున్నారు వైసీపీ నాయకులు.