Begin typing your search above and press return to search.

లండన్ లో భారతీయులపై జాత్యహంకారం

By:  Tupaki Desk   |   10 Aug 2018 7:34 AM GMT
లండన్ లో భారతీయులపై జాత్యహంకారం
X
బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది భారతీయ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు దుమారం రేపింది. లండన్ నుంచి బెర్లిన్ వెళుతున్న విమానంలోకి ఎక్కిన ఓ భారతీయ కుటుంబాన్ని బ్రిటీష్ ఎయిర్ లెన్స్ విమానం సిబ్బంది దించేసిన ఘటన కలకలం రేపింది.

విమానంలో ఎక్కడానికి ఎయిర్ పోర్టు నుంచి వాహనంలో భారతీయ కుటుంబం బయలు దేరింది. ఆ వాహనం ఎక్కేటప్పుడే వారి మూడేళ్ల బాబు పట్ల వాహనదారులు అనుచితంగా ప్రవర్తించారు. ఆ దెబ్బకు ఆ పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. విమానం ఎక్కాక కూడా ఏడుపు ఆపలేదు. ఆ గోల భరించలేక ఆ పిల్లాడితోపాటు అతడి అమ్మా-నాన్నను కూడా విమానం సిబ్బంది ఫ్లైట్ నుంచి దించేశారు. పిల్లాడు ఏడ్వడానికి ఎయిర్ పోర్ట్ సిబ్బందే కారణమని.. ఎంత చెప్పినా వినకుండా ఈ అమానుషానికి పాల్పడ్డారు. ఈ ఘటన జూలై 23న చోటుచేసుకుంది.

దీనిపై ఆ బాధిత వ్యక్తి కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకు గురువారం ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సురేష్ ప్రభు ఘటనపై బ్రిటీష్ ఎయిర్ వేస్ నుంచి వివరణ కోరాలని డీజీసీఏను ఆదేశించారు.

ఈ విషయం దుమారం రేగడంతో బ్రిటీష్ ఎయిర్ వేస్ కూడా స్పందించింది. భారతీయ కుటంబానికి జరిగిన అవమానంపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.