Begin typing your search above and press return to search.

పిల్లల సంఖ్య 20 ఉంటే బాగుంటుందని..

By:  Tupaki Desk   |   28 July 2016 3:30 PM GMT
పిల్లల సంఖ్య 20 ఉంటే బాగుంటుందని..
X
సరదాకో - సరసానికో గంపెడుమంది పిల్లాలను కనాలి అంటుంటారు కొందరు. ఇల్లంతా పిల్లా పాపలతో కళకల్లాడాలని దీవిస్తుంటారు ఇంకొందరు! ఇప్పుడు చెప్పబోయే దంపతులు "గంపెడుమంది పిల్లుండాలి" అనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారో లేక "ఇల్లంతా పిల్లా పాపలతో కళకల్లాడాలి" అన్నే దీవెన వీరిపై ఫలించిందో కానీ... ఏకంగా 18 మంది పిల్లలను కన్నారు. తాజాగా 19వ చిన్నారి కూడా వచ్చి చేరింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ వాస్తవం.. బ్రిటన్‌ లోనే అత్యంత పే..ద్ద కుటుంబంగా పేరొందిన స్యూ రాడ్‌ ఫోర్డ్‌ - నియోల్‌ కుటుంబానిది.

ఇప్పటికే 18 మంది పిల్లల్ని కన్న బ్రిటన్ దంపతులు తాజాగా 19వ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నెలలో స్యూ రాడ్‌ ఫోర్డ్‌ (41) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ఫొయెబె విల్లో అని నామకరణం చేశారు. ఇప్పుడు 19వ బిడ్డకు జన్మ నిచ్చిన రాడ్ ఫోర్డ్ తన 14వ ఏటనే తొలిసారి గర్భవతి అయ్యిందట. అక్కడి నుండి వరుసపెట్టి పిల్లల్ని కంటూనే వస్తుంది. సరే ఇప్పటికైనా ఇక ఆ పని ఆపేస్తారా అంటే.. అలా కాదు.. ఎలాగూ 19వరకూ వచ్చేశాం కాబట్టి.. ఆ మిగిలిన ఒక్క నెంబరును కూడా కనేస్తే రౌండ్ ఫిగర్ అవుతుంది కదా అని చెబుతున్నారట.

రాడ్‌ ఫోర్డ్‌ - నియోల్‌ దంపతులకు వరుసగా క్రిస్‌ (27) - సోఫీ (22) - క్లోయి (21) - జాక్‌ (19) - డానియెల్‌ (17) - ల్యూక్‌ (15) - మిల్లీ (15) - కేటీ (13) - జేమ్స్‌ (12) - ఎల్లీ (11) - ఐమీ (10) - జోష్‌ (9) - మాక్స్‌ (7) - టిల్లీ (6) - ఆస్కార్‌ (4) - కాస్పర్‌ (3) - హల్లీ (13 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. లండన్ లోని సొంత బేకరీని నడుపుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు ఈ దంపతులకు ఈ గంపెడు పిల్లల్ని పొషించడానికి ఏడాదికి సుమారు రూ. 26.56 లక్షలు ఖర్చు అవుతుందట. కాగా వీరికి ఎల్ఫీ అనే ఆడబిడ్డ పుట్టీన 21వారాల వయస్సులో చనిపోయింది.. అయినా కూడా ఆమెను కలుపుకుని తమ పిల్లల సంఖ్య 19గా చెబుతుంటారు ఈ బ్రిటన్ దంపతులు. వీరి కోరిక మేరకు ఆ రౌండ్ ఫిగర్ పూర్తి చేసిన తర్వాత అయినా ఆపుతారో లేక... మరింత ముందుకు పోతారో వేచి చూడాలి!