Begin typing your search above and press return to search.

బ్రిటన్ ఆడోళ్లు అలా చేసేస్తున్నారట

By:  Tupaki Desk   |   28 May 2016 10:30 PM GMT
బ్రిటన్ ఆడోళ్లు అలా చేసేస్తున్నారట
X
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. అసభ్యకరమైన పదాల్ని వినియోగించటంలో పురుషులతో పోలిస్తే మహిళలు కాస్త వెనుకబడి ఉంటారన్న భావన వ్యక్తమవుతుంది. కానీ.. వాస్తవంగా ఆ వాదనలో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని తాజాగా నిర్వహించిన ఒక సర్వే స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో టెక్ట్స్ ను ఎక్కువగా పంచుకునే ట్విట్టర్లో బ్రిటన్ మహిళలు వినియోగించే భాషపై తాజాగా అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడయ్యాయి.

అసభ్యకర పదాల్ని వినియోగించటంలో మగాళ్లకు ధీటుగా ఆడోళ్లు కూడా అలాంటి భాషను వినియోగిస్తారని తేలింది. బ్రటన్ కు చెందిన ఒక కంపెనీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మేసేజ్ లను విశ్లేషించింది. అసభ్య పదాల్ని వినియోగించే విషయంలో ఆడోళ్లు ఎంత త్వరగా అలాంటి పదాల్ని వినియోగిస్తున్నారన్న విషయాన్ని గమనించినప్పుడు.. సగటున రెండు లక్షల ట్వీట్లలో అసభ్యకర పదాల్ని వినియోగిస్తున్నట్లుగా తేలింది. బ్రిటన్ ఆడోళ్ల సంగతి ఓకే.. మరి మిగిలిన దేశాల మహిళల ట్వీట్లను విశ్లేషిస్తే మరెన్ని ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయో..?