Begin typing your search above and press return to search.

బ్రెడ్ కంపెనీలు మాయదారి కెమికల్స్ వాడరట

By:  Tupaki Desk   |   27 May 2016 4:42 AM GMT
బ్రెడ్ కంపెనీలు మాయదారి కెమికల్స్ వాడరట
X
ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఫీలై తినే బ్రెడ్ తయారీలో మాయదారి కెమికల్స్ వాడతారని.. దీని వల్ల ఆరోగ్యం సంగతి తర్వాత క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన రోగాలు వచ్చే అవకాశం ఉందంటూ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ సంస్థ విడుదల చేసిన నివేదిక సంచలనంగా సృష్టించిన సంగతి తెలిసిందే. దరిద్రపు గొట్టు రసాయనాలతో బ్రెడ్లను తయారు చేసే కంపెనీల్లో బ్రిటానియా.. హార్వెస్ట్ గోల్డ్ తో పాటు.. మెక్ డోనాల్డ్స్.. సబ్ వే.. డామినోస్.. కేఎఫ్ సీ లాంటి బోలెడన్ని పేరుమోసిన కంపెనీలు ఉన్నట్లుగా చెప్పటం తెలిసిందే.

తాము నాణ్యమైన బ్రెడ్లను తయారు చేస్తున్నామని.. ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు వాడటం లేదని ఆరోపణలు వచ్చిన కంపెనీలు తీవ్రంగా ఖండించినప్పటికీ.. అందుకు భిన్నమైన ప్రకటన ఒకటి గురువారం వెలువడింది.

అఖిల భారత బ్రెడ్ తయారీ అసోసియేషన్ పేరిట విడుదలైన ఈ ప్రకటనలో గురువారం రాత్రి నుంచి తయారు చేసే బ్రెడ్లలో.. ప్రమాదకరమైన రసాయానాలుగా పేర్కొంటున్న పొటాషియం బ్రోమేట్.. పొటాషియం అయోడేట్ రసాయనాల్ని వాడే ప్రసక్తే లేదని తేల్చింది. ఈ మాటను చెబుతూనే సీఎస్ ఈ విడుదల చేసిన నివేదికను మరోసారి పరిశీలిస్తామని పేర్కొంది. ఇప్పటివరకూ వినియోగించిన రసాయనాల స్థానంలో ఎంజైమ్స్.. ప్రత్యామ్నాయాల్ని వాడనున్నట్లు పేర్కొంది. మరి.. ఆ బుద్ధి ముందే ఉంటే బాగుండేది కదా..?