Begin typing your search above and press return to search.

బ్ర‌హ్మోస్‌ తో... భారత్ శ‌త్రు దుర్బేధ్య‌మే!

By:  Tupaki Desk   |   23 Nov 2017 11:17 AM GMT
బ్ర‌హ్మోస్‌ తో... భారత్ శ‌త్రు దుర్బేధ్య‌మే!
X
భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మరింత‌గా పెరిగింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే దాదాపుగా శ‌త్రు దుర్బేధ్యంగా ఉన్న భారత్‌... బ్ర‌హ్మోస్ తాజా క్షిప‌ణి ప్ర‌యోగం స‌క్సెస్‌ తో ఆ దిశ‌గా మ‌రింత శ‌క్తివంతంగా మారింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే శ‌త్రువు క‌న్నెత్తి చూడాలంటేనే బెదిరేంత స్థాయిలో త‌న అమ్ముల‌పొదిని నింపేసిన భార‌త్‌... ఆ శ‌క్తిని రోజు రోజుకూ పెంచుకుంటూ పోతోంది. ఇందులో భాగంగా తాజాగా నిర్వ‌హించిన బ్ర‌హ్మోస్ ప‌రీక్ష విజ‌యవంత‌మైన నేప‌థ్యంలో... శ‌త్రు దేశాల‌ను భీతిల్లిలే చేస్తున్న బ్ర‌హ్మోస్‌ ను ఇక గ‌గ‌న‌త‌లం నుంచి కూడా ప్ర‌యోగించే సామ‌ర్థ్యాన్ని భార‌త్ స‌ముపార్జించుకుంద‌నే చెప్పాలి. మిత్ర దేశం ర‌ష్యా టెక్నాల‌జీ సాయంతో రూపొందుతున్న బ్ర‌హ్మోస్‌ ను భార‌త్ విడ‌త‌ల‌వారీగా దాని సామ‌ర్ధ్యాన్ని పెంచుకుంటూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే భూత‌లం - స‌ముద్ర త‌లం నుంచి జ‌రిపిన ప్ర‌యోగాల్లో బ్ర‌హ్మోస్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా గ‌గ‌న త‌లం నుంచి నిర్వ‌హించిన ప‌రీక్ష‌లోనూ బ్ర‌హ్మోస్ పాసై పోయింది. ఈ మేర‌కు నిన్న నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో గ‌గ‌న‌తలం నుంచి దూసుకుపోయిన బ్రహ్మోస్‌... 290 కిలో మీట‌ర్ల దూరంలోని ల‌క్ష్యాన్ని ఛేదించింది.

ఈ ప్ర‌యోగం స‌క్సెస్‌ తో బ్ర‌హ్మోస్ క్షిప‌ణి... మూడు త‌లాల నుంచి అంటే... భూతలం - స‌ముద్ర త‌లం - గ‌గ‌న త‌లం నుంచి ప్ర‌యోగించ‌డానికి అనువైన క్షిప‌ణిగా అవ‌త‌రించింద‌నే చెప్పాలి. భూత‌లం - స‌ముద్ర త‌లాల నుంచి జ‌రిపిన ప్ర‌యోగాల్లో బ్ర‌హ్మోస్ ఇప్ప‌టికే విజ‌య‌వంత‌మైన సంగ‌తి తెలిసిందే. తాజాగా గ‌గ‌న‌త‌లం మీద నుంచి జ‌రిపిన ప‌రీక్ష‌లోనూ బ్ర‌హ్మోస్ విజ‌య‌వంత‌మైంది. దీంతో యుద్ధంలో మూడు త‌లాల‌పై నుంచి ప్ర‌యోగించ‌గ‌లిగే బ్ర‌హ్మాస్త్రం లాంటి బ్ర‌హ్మోస్ భార‌త అమ్ముల పొదిలో చేరిపోయిన‌ట్లే. అంటే యుద్ధంలో భార‌త్ ఈ అస్త్రాన్ని ఏ త‌లం నుంచి అయినా ప్ర‌యోగించే వీలుంద‌న్న మాట‌. గ‌గ‌న త‌లంలోనూ బ్ర‌హ్మోస్ విజ‌యవంతం కావ‌డంతో సుదూర ల‌క్ష్యాల‌ను కూడా చేధించే స‌త్తా భార‌త్ స‌ముపార్జించుకున్న‌ట్టే. భూత‌లం - స‌ముద్ర త‌లం నుంచి జ‌రిపిన ప్ర‌యోగాల్లో స‌త్ఫ‌లితాలు వ‌చ్చిన నేప‌థ్యంలో బ్ర‌హ్మాస్త్రాల్లాంటి బ్ర‌హ్మోస్ క్షిప‌ణులు ఇప్ప‌టికే భార‌త మిలిట‌రీ, నేవీల అమ్ముల పొదిలో ఇవి చేరిపోయాయి. తాజాగా గ‌గ‌న త‌లం మీద నుంచి నిర్వ‌హించిన ప‌రీక్ష‌లు కూడా విజ‌యవంతం కావ‌డంతో త్వ‌ర‌లోనే బ్ర‌హ్మోస్ క్షిప‌ణులు భార‌త వాయు సేన‌కు అందుబాటులోకి రానున్నాయి.

తాజా ప్ర‌యోగం స‌స్సెస్ కావ‌డంతో బ్ర‌హ్మోస్... భార‌త్ చేతిలో పాశుప‌తాస్త్రంగా మారిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిర్మలా సీతారామ‌న్ కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత జ‌రిగిన ఈ ప‌రీక్ష విజ‌యవంతం కావ‌డం కూడా ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాల్సిందే. ఓ మ‌హిళ‌గా ర‌క్ష‌ణ శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నిర్మ‌లా... పురుషులు కూడా వెళ్ల‌లేని ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ... భార‌త సైనిక బ‌లాల్లో ఆత్మ‌స్థైర్యం నింపుతున్నారు. ఈ క్ర‌మంలో బ్ర‌హ్మోస్ గ‌గ‌న త‌ల ప‌రీక్ష‌లు కూడా విజ‌యవంతం కావ‌డంతో నిజంగానే నిర్మ‌ల‌లో మ‌రింత ఉత్సాహం క‌నిపిస్తోంది. శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించిన నిర్మ‌ల‌... బ్ర‌హ్మోస్ స‌క్సెస్‌ తో భార‌త సైనిక ద‌ళాల శ‌క్తి మూడింత‌లైంద‌ని కూడా ఆమె పేర్కొన్నారు. ఇక తాజా ప్ర‌యోగం గురించి చెప్పుకుంటే... బంగాళాఖాతంలో నిర్వ‌హించిన ఈ పరీక్ష స‌క్సెస్ అయ్యింది. బ్రహ్మోస్-ఎయిర్‌ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్ (ఏఎల్సీఎం) ప్రయోగాన్ని రెండు దశల్లో చేపట్టగా, బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని తెలిపింది. ఈ ప్రయోగంతో 2.5టన్నుల బరువు గల బ్రహ్మోస్ క్షిపణికి 290 కిలోమీటర్ల రేంజ్‌ లో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉన్నదని మరోసారి నిరూపణ అయ్యిందని రక్షణశాఖ పేర్కొన్నది. తద్వారా భారత రక్షణ శాఖ మరో మైలురాయిని చేరుకున్నది.