Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ రైతు దీక్ష...తేదీల్లో మార్పు

By:  Tupaki Desk   |   21 April 2017 11:30 AM GMT
జ‌గ‌న్ రైతు దీక్ష...తేదీల్లో మార్పు
X
రైతు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని గుంటూరు వేదికగా ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 26 - 27 తేదీల్లో నిర్వహించాల్సిన రైతు దీక్ష మే 1 - 2 తేదీలకు మార్చిన‌ట్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నార‌య‌ణ తెలిపారు. హైద‌రాబాద్‌ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో బొత్స మాట్లాడుతూ ప‌లు అనివార్య కార‌ణాల వ‌ల్ల వైఎస్‌ జగన్‌ దీక్ష వాయిదా పడిందన్నారు. వ్యవసాయం శుద్ధ దండగ అనే ఆలోచనను చంద్రబాబు నాయుడు సార్థకత చేసుకుంటున్నాడని మంత్రి బొత్స సత్య నారాయణ విమర్శించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా చెల్లించకుండా అన్నదాతను రోడ్డున పడేస్తున్నాడని వాపోయారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం.. పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు ప్రభుత్వమే మద్దతు ధరను కల్పిస్తుందని చంద్రబాబు ప్రగల్భాలు పలికారన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఆ స్థిరీకరణ నిధి కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని బొత్స మండిపడ్డారు. రైతును మోసం చేస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని..రైతుల తరపున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని బొత్సా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మిర్చి - సుబాబుల్ - పసుపు పండించే రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. కందులు - టమాట - మామిడి పండించే రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీసినా చలనం లేదన్నారు. మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేస్తాం.. సీసీఐ ద్వారా కొంటామని చంద్రబాబు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. నూటికి 80 శాతం మంది రైతులు దళారులకు పంటను అమ్ముకొని మోసపోతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. అందుకే ప్రభుత్వ మెడలు వంచైనా రైతు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని గుంటూరు వేదికగా ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతుదీక్ష చేయనున్నారని బొత్స స్పష్టం చేశారు.

క్వింటాలుకు రూ. 1500 ఇస్తామని చెప్పి సర్టిఫికేట్లు అంటూ తిరకాసు పెడుతున్నారని బొత్స మండిప‌డ్డారు. రైతు ద‌గ్గ‌ర అన్ని ప‌త్రాలు ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుడై ఉంటేనే ఆ ధర కల్పిస్తున్నారని విమర్శించారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర లేక‌పోవ‌డంతో నూటికి 80 శాతం మంది రైతులు దళారులకు పంటను అమ్ముకొని మోసపోతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. గ‌తంలో ప్రత్తి రైతుల విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా మోసం చేసిందన్నారు. సంబంధిత మంత్రి అనుచరులు - టీడీపీ నాయకులు - కంపెనీల యాజమాన్యాలు రైతుకు మద్దతు ధర ఇవ్వకుండా దోచుకుతిన్నారని ఆరోపించారు. ప్రత్తి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే 26 మంది దోషులుగా తేలిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఆ ప్రభుత్వాలు చొరవ చూపి ఇతర రాష్ట్రాలకు పంటలను పంపించి రైతులను ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధంగా మోసం చేస్తే రైతులు వారి ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంటే రాజకీయ ఉద్దేశ్యాలతో ప్రభుత్వం తన పబ్బం గడుపుకోవడానికి పయత్నం చేస్తుందని బొత్స చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/