Begin typing your search above and press return to search.

వైఫై సిగ్నల్ రాలేదా.. బీర్లు కొనండి

By:  Tupaki Desk   |   28 Nov 2015 8:56 AM GMT


వైఫై...దాదాపు ప్ర‌తి ఇంట్లో ఉండే వ‌స్తువు కోటాలోకి ఎపుడో చేరిపోయిన సాంకేతిక సౌల‌భ్యం. ఇంట్లో 24*7 ఆన్‌ లో ఉండే అతిత‌క్కువ ఎల‌క్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ లో వైపై రౌట‌ర్ ఒక‌టి. అయితే కాస్త విశాల‌మైన ఇళ్లు ఉన్న వారికి లేదా వేగం త‌క్కువ ఉన్న వారికి వైఫైతో ఎదుర‌య్యే స‌మ‌స్య ఏంటంటే..ఇంటి మొత్తం స్థ‌లంలో ఒకే రీతిలో సిగ్న‌ల్స్ అంద‌క‌పోవ‌డం లేదా వేగం త‌క్కువ‌గా ఉండ‌టం. ఈ స‌మ‌స్య‌కు ఓ సూప‌ర్ ప‌రిష్కారం అందుబాటులోకి తెచ్చారు.

ఇంత‌కీ ఈ ఆవిష్క‌ర‌ణ చేసింది ఏ సైంటిస్టులో అనుకునేరు. మ‌న‌లాంటి సామాన్యులే కాస్త భిన్నంగా ఆలోచించారు. ఇంత‌కీ వారేం చేశారంటే...తాగి పారేసిన ఖాళీ బీర్ టిన్‌ ల‌ను ఉపయోగించి వైఫై వేగాన్ని రెట్టింపు చేసే ప్ర‌క్రియ‌ను ఆవిష్క‌రించారు. వీరి ఆవిష్క‌ర‌ణ ద్వారా వైఫ్ యూజర్స్ వారి సిగ్న‌ల్స్ ప‌రిధిని 2-3 రెట్లు పెంచుకోవ‌చ్చు. ఈ టెక్నిక్ వారొక్క‌రే వాడుకోకుండా...పేటెంట్లు వంటి గంద‌ర‌గోళం ఏమీ లేకుండా అంద‌రూ వాడుకునే సౌల‌భ్యం క‌ల్పించారు. బీర్ టిన్‌ తో వైఫ్ సిగ్నల్‌ స్ర్టెంగ్త్‌ ను ఎలా పెంచుకోవాలో డెమాన్‌ స్ర్టేషన్ చేసి చూపించ‌డ‌మే కాకుండా అంద‌రికీ అందుబాటులో వుండేలా ఈ వీడియోను యూట్యూబ్‌ లో పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆల‌స్యం వైఫై ప్రియులు ఈ టెక్నిక్‌ ను ట్రై చేసి చూడండి.