Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ ఓట‌మికి ప్ర‌తిన‌..టీడీపీ నేత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

By:  Tupaki Desk   |   13 Nov 2018 3:58 PM GMT
ఉత్త‌మ్ ఓట‌మికి ప్ర‌తిన‌..టీడీపీ నేత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న
X
ప్ర‌జాకూట‌మి పేరుతో కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలో ఏర్పాటైన మిత్ర‌ప‌క్షాల బంధంపై ఆయా పార్టీ నేత‌ల్లోనే భిన్నాభిప్రాయాలు కొన‌సాగుతున్నాయి. కూట‌మి క‌ట్టే స‌మ‌యంలోనే ఆయా పార్టీల నేత‌లు భ‌గ్గు మ‌న‌గా - సీట్ల ప్ర‌క‌ట‌న త‌ర్వాత అది తారాస్థాయికి చేరింది. తాజాగా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికే ఓట‌మి రుచి చూపిస్తాన‌ని టీడీపీ నేత ప్ర‌క‌టించ‌డం సంచ‌లంగా మారింది. తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోదాడ టీడీపీ టిక్కెట్ ఆశించిన‌ బొల్లం మల్లయ్య యాదవ్ తాజాగా ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఒక కుటుంబానికి ఒకే సీటు అన్న ఏఐసీసీ నిబంధనలను తొంగలో తొక్కి తన భార్యకు కోదాడ నుంచి టికెట్ ఇప్పించుకున్న ఉత్త‌మ్ దంప‌తుల‌ను ఓడిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

కోదాడలో టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ - తన స్వార్థం కోసం ఎవరినైనా బలి పశువులను చేసే నైజం ఉత్తమ్‌ దన్నారు.2009 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ కాంగ్రెస్ టికెట్ తనకు ఇప్పిస్తానని నమ్మబలికి హుజూర్‌నగర్ టికెట్ తాను తీసుకున్నాడని - కోదాడలో తనను కాదని మహబూబ్‌ జానీని దింపి ఇద్దరినీ బలిపశువులను చేశారని ఆరోపించారు. కూటమి ధర్మంలో భాగంగా తమ నాయకుడు ఎల్ రమణ జనగామ నుంచి పోటీ చేయకుండా కాంగ్రెస్‌ కు త్యాగం చేశారని, అయినప్పటికీ ఉత్తమ్ మాత్రం తన భార్య కోసం కూటమి ధర్మాలను విస్మరించారని విమర్శించారు.సీట్లు ఇవ్వకుండా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్‌ ను - ఆయన భార్యను ఓడించేందుకు కంకణ బద్ధులు కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ పార్టీని టీడీపీ సీనియ‌ర్ అయిన బొల్లం మ‌ల్ల‌య్య ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం. న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార పార్టీలో అగ్రవర్గాలకు చెందిన ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ - బడుగు వర్గాలకు చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ సీటు కట్టబెట్టిన విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం గమనించాలన్నారు. పద్నాలుగేళ్లుగా ఇక్కడి ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, అందుకే ప్రజల ఆశీర్వాదంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలువాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాగా, ఇటు టీఆర్ ఎస్ పార్టీని మెచ్చుకోవ‌డం అటు...ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డిని ఓడిస్తాన‌ని బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ ప్ర‌క‌ట‌న చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.