Begin typing your search above and press return to search.

నేలపై కారు.. నింగిలో విమానం

By:  Tupaki Desk   |   24 Jan 2019 5:45 AM GMT
నేలపై కారు.. నింగిలో విమానం
X
రోడ్డుపై వెళ్లే కారు ఆకాశంలో విహరిస్తే ఎలాగుంటుందో ఊహించండి.. ఎంతో బాగుంటుందో కదా.. మన ఊహను అక్షరాల నిజం చేయబోతుంది విమాన తయారీ సంస్థ బోయింగ్. మనం ఇంతవరకు ఎగిరే విమానాలను మాత్రమే చూశాం. ఇక రానున్న రోజుల్లో ఎగిరే కార్లను చూడబోతున్నాం.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ప్రస్తుతం బోయింగ్ కంపెనీ పట్టణ రవాణా రంగంలో సంచలనాత్మమైన మార్పు తీసుకొచ్చేలా ఫ్లయింగ్ కార్ ప్రొటోటైప్ ను సిద్ధం చేసింది. ఈ వాహనం నేలపై నుంచి నిలువుగా గాల్లోకి ఎగురుతుంది. విమానంలా గాల్లో దూసుకెళుతుంది. రన్ వే లేకుండానే సులువుగా ల్యాండ్ అవడం దీని ప్రత్యేకత. దీనిని వర్జీనియాలోని మనాసాన్ విమానాశ్రమంలో తొలిసారిగా బోయింగ్ కంపెనీ పరీక్షించి విజయంతమైందని పేర్కొంది.

ఈ వాహనం రాకతో పట్టణ రవాణా రంగంలో పెనూ మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తుంది. 30అడుగుల పొడవు(9మీటర్లు) ఉండే ఈ వాహనం హెలికాప్టర్, డ్రోన్, కారు, విమానాల మేళవింపు అని చెప్పొచ్చు. ఈ వాహనంతో ట్రాన్స్ పోర్టేషన్, డెలివరీ సేవలు మరింత సులువుకానున్నాయి. ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలు చేసే బోయింగ్ కంపెనీ రోడ్డుపై కారులా, ఆపై గాల్లో విమానంలా ప్రయాణించే వాహనానికి శ్రీకారం చుట్టి విజయవంతమైంది. మరికొన్ని రోజుల్లో గాల్లో ఎగిరే కార్లు మన ఇంటి ముందుకొచ్చి వాలిన ఆశ్చర్యపోనవరం లేదేమో..