కేటీఆర్ మాట ఇవ్వలేదని ఆమె బీజేపీలో చేరుతోంది

Tue Nov 13 2018 22:10:18 GMT+0530 (IST)

టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలిదశలో ప్రకటించిన 105 మందిలో కానీ - తర్వాతి జాబితాలో కానీ తనకు చోటు దక్కకపోవడంతో తనకు టిక్కెట్ ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచడంతో బొడిగే శోభ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కేసీఆర్‌ను కలువడానికి బొడిగె శోభ ప్రయత్నించారు. ఈ క్రమంలో సిరిసిల్లలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ రాకకోసం శోభ గంటపాటు ఎదురు చూశారు. వేములవాడకు చేరుకున్న కేటీఆర్..చెన్నమనేని రమేష్ నివాసంలో భోజనం చేశారు. ఈ భోజనానికి వారితో పాటు శోభ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య చొప్పదండి టికెట్ పెండింగ్ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కానీ మంత్రి కేటీఆర్ ఎలాంటి స్పష్టమైన హామీనివ్వకపోడంతో భోజనం మధ్యలో నుండే శోభ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఎంత మాత్రం లేకపోవడంతో ఆమె తుది నిర్ణయానికి తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న బొడిగె శోభ ఈ క్రమంలో ఆరు మండలాల కార్యకర్తలతో జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీలో చేరాలని సూచించిన కార్యకర్తలు సూచించడంతో త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె కార్యకర్తలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా టికెట్ విషయం తేల్చాలని టీఆర్ఎస్ కు బొడిగెశోభ ఫైనల్ గా తేల్చి చెప్పాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా బీజేపీలో చేరుతారని పుకార్లు షికార్లు అయినప్పటికీ ఇప్పటివరకూ అధిష్టానం నుండి ఎటువంటి ప్రకటనగానీ హామీ గానీ రాకపోవటంతో బీజేపీలో చేరేందుకు బొడిగె శోభ  దాదాపు ఖాయమైపోయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పెద్దలు సైతం ఆమె పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.