Begin typing your search above and press return to search.

శ్రీకాకుళం 'బ్లూ' బ్యాచ్ దొరికింది!

By:  Tupaki Desk   |   27 Sep 2016 4:47 AM GMT
శ్రీకాకుళం బ్లూ బ్యాచ్ దొరికింది!
X
ఆమదాలవలసలో అశ్లీల చిత్రాల చిత్రీకరణ అనే అంశం గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లో స్థానిక యువతే పాల్గొన్నారని, స్థానికంగా ఉంటున్న మహిళలు, యువతులతోనే ఈ కార్యక్రమాలు జరిగాయని వార్తలు వచ్చాయి! ఈ క్రమంలో తాజాగా ఈ ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి మహేష్‌ అని.. మహేష్ స్నేహితులు, ఈ ముఠాలో సభ్యులైన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఇంటర్‌ నెట్‌ సెంటర్‌ నడుపుతున్న చింతాడ మహేశ్‌ బాబు.. చూడ్డానికి అమాయకంగా ఉంటాడు. కానీ, మహిళలకు, అమ్మాయిలకు మాయమాటలు చెప్పి, వారిని లోబరుచుకోవడం, వాటిని రహస్యంగా చిత్రీకరించడం అనంతరం ఆ దృశ్యాలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేయడం చేస్తుంటాడట. ఇందులో ప్రధాన సూత్రధారి మహేష్‌ తో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న సమయంలో ఆ చిత్రాలను చేజిక్కించుకున్న సంతోష్‌ - రమేష్ లు వాటిని చాలా మంది వ్యక్తుల మెుబైల్స్‌ కు - కంప్యూటర్లకు పంపిస్తూ ప్రచారం చేసినట్టు వారే స్వయంగా ఒప్పుకున్నారట. దీంతో మహేష్ పై ఐటీ యాక్టుతోపాటు ఐపీసీ సెక్షన్‌ 328 - 420 - 376 కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. దర్యాప్తులో భాగంగా ఒక హార్డు డిస్క్ - మూడు సెల్‌ఫోన్లు - ఒక ట్యాబ్ - ఒక పెన్‌ డ్రైవ్‌ ను స్వాధీనం చేసుకున్నామని - అందులో అశ్లీల చిత్రాలు లభ్యమయ్యాయని తెలిపిన పోలీసులు - మహేష్‌ ఉచ్చులో ఉన్న వారు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, అతని వద్ద ఉన్న వీడియోలు బయటకు రాకుండా చూసే బాధ్యత తమది అని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఎవరి వద్ద ఏ సమాచారం ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార మార్గం చూపిస్తామని పోలీసులు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/