Begin typing your search above and press return to search.

చుక్క‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్న చంద్రుడు

By:  Tupaki Desk   |   16 Dec 2018 7:33 AM GMT
చుక్క‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్న చంద్రుడు
X
ఆయ‌న మొన్న‌రటి వ‌ర‌కూ దేదీప్య‌మానంగా వెలుగొందిన చంద్రుడు. ఆయ‌న దేశ రాజ‌కీయాల్లోనే ఓ వెలుగు వెలుగుతున్న నాయ‌కుడు. ఆయ‌న త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో ప్ర‌త్య‌ర్ధుల‌కు మఊడు చెరువుల నీళ్లు తాగించిన యోథుడు. ఆయ‌న అన్ని యుద్ధ‌ముల ఆరి తేరిన వాడు. ఇదంతా గతం. ప్ర‌స్తుతం మాత్రం ఆయ‌న రాజ‌కీయంగా చిన్న అలికిడి అయినా భీతిల్లుతున్న వాడు. త‌న‌కు ఏదో జ‌రుగుతుంద‌ని... త‌న‌ను కాపాడాల్పింది ప్ర‌జ‌లే అని వారిని వేడుకుంటున్న నాయకుడు. అంద‌రూ క‌లిసి త‌న‌ను ఇరుకున పెడుతున్నారంటూ వాపోతున్న మాజీ ధీశాలి. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌ర‌నుకుంటున్నారా. ఆయ‌నే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. గ‌డ‌చిన కొన్ని నెల‌లుగా చంద్ర‌బాబు నాయుడ్ని భ‌యం వెంటాడుతోంది. 2014 ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ - ప‌వ‌న్ క‌ల్యాణ్ ల అండ‌తో అదికారాన్ని అందుకున్న చంద్ర‌బాబు నాయుడికి నాలుగేళ్లు బాగానే గ‌డిచింది. ఇన్నాళ్లూ భార‌తీయ జ‌న‌తా పార్టీతో కాపురం స‌జావుగానే సాగింది. ఇదిగో ఈ మ‌ధ్య‌న అంటే ఏడెనిమిది నెల‌లుగానే చంద్ర‌బాబు నాయుడి భార‌తీయ జ‌న‌తా పార్టీ చుక్క‌లు చూపిస్తోంది.ఆకాశంలో చంద్రుడికి చుక్క‌లు ప‌క్క‌నే ఉన్న‌ట్లుగా తోచినా వాటి మ‌ధ్య చాలా దూరం ఉంటుంది. అలాగే అమ‌రావ‌తికి దేశ రాజ‌ధాని దూరంగానే ఉన్నా ఇప్పుడిప్పుడే ఆ రెండూ ద‌గ్గ‌ర‌వుతున్నాయి. భార‌త రాజ‌కీయ ముఖ‌చిత్రంలో అరివీర భ‌యంకరుడు అని చెప్పుకుంటున్న నారా చంద్ర‌బాబు నాయుడికి ఢిల్లీ చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి.

ఈ ప‌రిణామాల‌కు తోడు త‌న‌కు తానే గోతిలో ప‌డ్డ‌ట్టుగా తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో క‌లిసారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌తో తెలంగాణ‌లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితిని ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. అయితే ఇది కూడా ఫ‌లించ‌లేదు. ఈ వీరిద్ద‌రి క‌ల‌యిక‌ను అప‌విత్ర క‌ల‌యిక‌గా భావించిన తెలంగాణ ప్ర‌జ‌లు వీరికి ప‌రాభ‌వం మిగిల్చారు. ఇంత వ‌ర‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించ‌ని తెలంగాణ రాష్ట్ర అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు ఇక ముందు తాము కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో త‌ల దూరుస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇది చంద్ర‌బాబు నాయుడికి ఊహించ‌ని ప‌రిణామం. తెలంగాణ రాష్ట్ర సమితి నూత‌న కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు అయితే తాము ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని న‌ర్మ‌గ‌ర్భంగా ప్ర‌క‌టించారు. ఇది చంద్ర‌బాబు నాయుడికి మింగుడు ప‌డ‌ని అంశం. మ‌రోవైపు అస‌దుద్దీన్ ఒవైసీ కూడా చంద్ర‌బాబు నాయుడికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తామ‌న్నారు. ఇవ‌న్నీ రానున్న రోజుల్లో చంద్ర‌బాబు నాయుడికి చుక్క‌లు చూపించే ప‌రిణామాలే అని ప‌రిశీల‌కులు అంటున్నారు.