పనామా పేపర్స్ : పెద్ద తిమింగళాలు ఇవే

Thu Jun 21 2018 19:28:30 GMT+0530 (IST)

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ల లీక్ అంశం మరోమారు వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత పనామనియన్  లా కంపెనీ మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన మరికొన్ని పరిశోధన పేపర్లు బయటకు వచ్చాయి. వీటిలో 12 వేల పేపర్లు భారతీయులకు చెందినవే. దాదాపు 12 లక్షలకు పైగా సరికొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) అధ్యాయనం చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బయటపెట్టిన పత్రాలన్నింటిని దక్షిణ జర్మనీ వార్తాపత్రిక సేకరించింది.2016లో 500 మంది భారతీయుల పేర్లు మొస్సాక్ ఫొన్సెకాకు చెందిన డాక్యుమెంట్లలో ఉండటంతో దీనిపై  విచారణ జరిపేందుకు  మల్టీ ఏజెన్సీ గ్రూప్(MAG)ను ఇండియన్ గవర్నమెంట్ నియమించింది. ఈ కొత్త డాక్యుమెంట్లలో 2016 పేపర్లలో లేని భారత్ కు చెందిన పలువురు కొత్త పేర్లు ఉన్నాయి. టెలికాం వ్యాపార దిగ్గజం సునీల్ భారతీ మిట్టల్ కొడుకు హైక్ మెసెంజర్ ఫౌండర్ అండ్ సీఈవో కవిన్ భారతీ మిట్టల్ భారత్ మల్టీఫ్లెక్స్ ల దిగ్గజం PVRసినిమాస్ యజయాని అజయ్ బిజ్లీఆయన భార్య సెలీనా - కొడుకు అమీర్ - ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ అశ్విన్ దాని కొడుకు జలాజ్ అశ్విన్ దాని పేర్లు ఈ కొత్త లిస్ట్ లో ఉన్నాయి. దాదాపు 12 లక్షలకు పైగా కొత్త పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ICIJ) అధ్యయనం చేసింది. అయితే గతంలో పనామా పేపర్ల అంశంలో తమ పేరు రావడాన్ని తప్పుబట్టిన కొందరి ప్రముఖులు పేర్లు మళ్లీ ఇప్పుడు బయటకు వచ్చాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - శివ్ విక్రమ్ ఖేమ్కా - అనురాగ్ కేజ్రీవాల్ తదితర ప్రముఖులకు ఆఫ్ షోర్ కంపెనీలతో బిజినెస్ లింక్స్ కు సంబంధించిన ఆధారాలను ICIJ జర్నలిస్టులు సంపాదించారు.

తాజా పేపర్లలో ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు ఇవే..

- శివ్ విక్రమ్ ఖేమ్కా
- నటుడు అమితాబ్ బచ్చన్
- మాజీ సొలిసిటర్ జనరల్ తనయుడు జహంగీర్ సోరబ్జీ
- డీఎల్ ఎఫ్ గ్రూప్ కు చెందిన కేపీ సింగ్ - ఆయన కుటుంబం
- అనురాగ్ కేజ్రీవాల్
- మెహ్రాసన్స్ జ్యువెల్లర్స్‌కు చెందిన నవీన్ మెహ్రా
- అండర్ వరల్డ్ డాన్ ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్