Begin typing your search above and press return to search.

ఒక రాత్రి కక్కుర్తికి ఆ యువకుడు ఆసుపత్రికి..

By:  Tupaki Desk   |   19 Aug 2019 6:47 AM GMT
ఒక రాత్రి కక్కుర్తికి ఆ యువకుడు ఆసుపత్రికి..
X
మితానికి మించింది లేదు. అతితో వచ్చే అనర్థాలకు నిలువెత్తు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాల్సిందే. ప్రపంచ మీడియాలో సంచలనంగా మారిన ఈ యువకుడి వ్యవహారం ఇప్పుడు కోట్లాది మంది ఆసక్తికరంగా ఫాలో అవుతున్నారు. ఒక రాత్రి ఫాంటసీ కోసం చేయకూడని పని చేసి.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న అతగాడి వ్యవహారం ఇప్పుడెక్కడి వరకూ వచ్చిందంటే.. జీవితంలో మళ్లీ సెక్స్ చేసే అవకాశం ఉందా? అన్న వేదనే కాదు.. ఆసుపత్రికి అయ్యే వైద్య ఖర్చుల కోసం ఆన్ లైన్ లో విరాళాలు సేకరించాల్సిన దుస్థితి. ఇంతకీ ఏం జరిగిందన్నది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

డాని పొలారిస్ అనే జర్మన్ యువకుడికి సెక్స్ ఆలోచనలు ఎక్కువ. కొద్ది రోజుల క్రితం ఒక నర్సుతో సెక్స్ పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఆ సంతోష సమయాన్ని మామూలుగా కాకుండా ఇరగదీయాలన్న కాంక్షతో స్నేహితుల సలహా అడిగితే వయాగ్రా వాడమని సెలవిచ్చారు. వయగ్రాతో దుమ్ము దులిపేద్దామని ఆశ పడ్డ అతగాడు.. అత్యాశతో వయగ్రా ఇంజెక్షన్ ను అంగానికి చేయించుకున్నాడు.

అతి ఎంత అనర్థమో కాసేపటికే అతగాడికి అర్థమైంది. దీర్ఘ అంగస్తంభన కోసం చేయించుకున్న వయగ్రా ఇంజెక్షన్ తన సత్తా చాటటం మొదలెట్టింది. దాని పవర్ ఏ మాత్రం ఊహించలేని డానీకి దిమ్మ తిరిగిపోయింది. నిమిషాలు కాస్తా.. గంటలు అయ్యాక కూడా అంగస్తంభన కాకపోవటం తర్వాత.. అది అలానే ఉండిపోవటంతో భరించలేనినొప్పికి గురయ్యాడు.

దీంతో.. స్వర్గపు అంచుల వరకూ వెళ్లాలనుకున్న అతగాడికి నరకం అంటే ఏమిటో కళ్లకు కట్టింది. భరించలేని నొప్పితో విలవిలాడిపోయాడు. హుటాహుటిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులు దాటినా కూడా అంగం స్తంభించిపోయి ఉండడటం.. నార్మల్ కండిషన్ లోకి రాకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాడు. ఆసుపత్రిలో చేరినా ఫలితం లేని పరిస్థితి. ఇప్పటికే ఐదు సార్లు అంగంలో చేరిన రక్తాన్ని సూదితో వైద్యులు తీసినా నార్మల్ కాలేదు.

ఈ సమస్యను వైద్యులు ప్రియాపిజమ్ గా చెబుతున్నారు. ఇలాంటి కేసుల్లో పురుషాంగానికి చాలా నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. తాను ఇంజెక్షన్ తీసుకోకుండా ఉండాల్సిందని.. తన జీవితంలో దీనికి మించిన చెత్త పని మరొకటి లేదని వాపోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఆసుపత్రిలో ఇతగాడికి అవుతున్న ఖర్చుల కోసం ఆన్ లైన్లో అతడి స్నేహితులు విరాళాల్ని సేకరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తన పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోటోల్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తున్నాడు. అతడ్ని సాధారణ స్థితిలోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇప్పటికి అతడి అంగం ఇంకా కొంచెం స్తంభించే ఉందని చెబుతున్నాడు డానీ. తనకేం జరుగుతుందో అర్థం కావట్లేదని.. జీవితంలో మళ్లీ సెక్స్ చేయగలుగుతానా? లేదా? అన్న ఆందోళనతో కిందా మీదా పడిపోతున్నాడు. ఇతగాడి ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో అనుకుంటూ వేదన చెందుతున్న వారు కొందరైతే.. ఇంత అతి చేస్తే మరిలాంటి తిప్పలు తప్పవని ఛీకొడుతున్నా ఇంకొందరు.