Begin typing your search above and press return to search.

వైఎస్ మృతికి బాబుకు లింకు పెట్టిన భూమన

By:  Tupaki Desk   |   30 May 2016 9:52 AM GMT
వైఎస్ మృతికి బాబుకు లింకు పెట్టిన భూమన
X
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహతుడు.. మాజీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకున్న అనుమానాలంటూ ఆయన విచిత్రమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపేలా ఉండటం గమనార్హం. మహానాడులో జగన్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. వైఎస్ మృతి వెనుక చంద్రబాబు నాయుడి హస్తం ఉందన్న అనుమానాలు తనకు కలుగుతున్నట్లుగా భూమన వ్యాఖ్యానించారు.

తమ పార్టీ అధినేత జగన్ ను సైతం నిర్మూలించేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నట్లగా తనకు సందేహాలు కలుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎంత విరోధం ఉన్నా.. కొన్ని విషయాల మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆచితూచి ఆరోపణలు చేయాల్సి ఉంది. కానీ.. భూమన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.