Begin typing your search above and press return to search.

మేం సిద్ధం.. మీరు రెఢీనా మిత్రమా..?

By:  Tupaki Desk   |   22 Jan 2017 12:23 PM GMT
మేం సిద్ధం.. మీరు రెఢీనా మిత్రమా..?
X
రాజకీయాల్లో టైమ్లీగా స్పందించటానికి మించింది మరొకటి ఉండదు. తాజాగా జగన్ కు సన్నిహితుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమాన కరుణాకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. టైమ్లీగా ఉన్నాయని చెప్పాలి. ఏపీకి ప్రాణాధారమైన ప్రత్యేక హోదా అంశంపై పార్టీలకు అతీతంగా పోరాడదామని పిలుపిచ్చారు. పార్టీలు.. వ్యక్తుల స్వప్రయోజనాల కంటే తెలుగుజాతి మొత్తం ప్రయోజనాలు ముఖ్యమని నిరూపించుకునేలా చంద్రబాబువ్యవహరించాలని ఆయన కోరారు.

ఇందుకుగాను.. ఏపీ ఎంపీలు అంతా తమ రాజీనామాలతో కేంద్రంపైపోరాడదామన్నారు. జల్లికట్టు కోసం తమిళులు సుప్రీంకోర్టు తీర్పును సైతం పక్కనపెట్టుకొని.. ఆర్డినెన్స్ తెచ్చుకున్నారని.. అలాంటిది ప్రత్యేక హోదా మీద మనంముందుకు వెళ్లలేమా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగు జాతి మొత్తంగాకదలాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా ఉన్నఅడ్డంకి చంద్రబాబు అని మండిపడ్డారు.

పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చే వరకూపోరాడదామన్న భూమానా.. ఓట్లకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు.. ఆకేసులో తాను ఎక్కడ ఇరుక్కుపోతానన్న ఉద్దేశంతో కేంద్రం అడుగులకుమడుగులు వొత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన రాజకీయపుమాటల్ని వదిలేస్తే.. పక్కనున్న తమిళులు జల్లికట్టు మీద ఏ విధంగా అయితే కలిసికట్టుగా ఆందోళనలు చేసిన వైనాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. ఏపీ ప్రజలు..పార్టీలు.. సెలబ్రిటీలంతా కలిసి ప్రత్యేక హోదా మీద పోరాడితే.. కేంద్రం రియాక్ట్ కాకుండా ఉంటుందా? సరైన టైంలో మాట్లాడిన భూమానా మాటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారన్నదే ప్రశ్నగా చెప్పక తప్పదు.

హోదా కోసం రాజీనామా మాటను ఇప్పటికే పలుమార్లు జగన్ చెప్పిన నేపథ్యంలో.. భూమానా రాజీనామా వ్యవహారాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లి.. ఈ విషయంపై సంచలన నిర్ణయం తీసుకునేలా చేస్తే.. ఏపీ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కటమే కాదు.. ప్రత్యేక హోదా అంశం మరోసారి రాజుకోవటం ఖాయమని చెప్పాలి. మరి.. ఆ దిశగా భూమానా అడుగులు వేస్తారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/