Begin typing your search above and press return to search.

కాంట్రాక్ట‌రుకు భూమా వార్నింగ్‌.. దొరికిపోయిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   23 Jan 2017 1:01 PM GMT
కాంట్రాక్ట‌రుకు భూమా వార్నింగ్‌.. దొరికిపోయిన‌ట్లేనా?
X
ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇర‌కాటంలో ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ‌కు చెందిన ఓ కాంట్రాక్ట‌ర్‌ ను భూమా బెదిరించిన విష‌యం పొక్క‌డం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారితే స‌ద‌రు వ్య‌క్తిని బెదిరించిన‌ట్లు ఒక‌సారి..కానే కాద‌ని చెప్పి మ‌రోసారి ప్ర‌క‌టించ‌డం ద్వారా భూమా నాగిరెడ్డి ఇర‌కాటంలో ప‌డ్డారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే ఓ కాంట్రాక్ట‌ర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆళ్ల‌గ‌డ్డ‌లో ప‌నులు చేసే కాంట్రాక్టును సంపాదించుకున్నాడు. అయితే ఆయ‌న్ను స‌బ్ కాంట్రాక్టు త‌న మ‌నుషుల‌కు ఇవ్వాల‌ని కోరుతూ భూమా బెదిరించాడు. దానికి తెలంగాణకు చెందిన స‌ద‌రు కాంట్రాక్ట‌రు నో అన‌డంతో... తెలంగాణ‌లోనూ త‌న‌కు ప‌వ‌రుంద‌ని చెప్తూ స‌ద‌రు కాంట్రాక్ట‌రుకు వార్నింగ్ ఇచ్చాడు.

అయితే ఈ బెదిరింపుల‌ను స‌దరు కాంట్రాక్ట‌ర్ బ‌య‌ట పెట్ట‌డంతో క‌ల‌క‌లం రేకెత్తింది. దీంతో ఓ మీడియా సంస్థ భూమా నాగిరెడ్డిని ఇంట‌ర్వ్యూను చేసింది. ఈ సంద‌ర్భంగా ఆడియోలో ఉన్న గొంతు త‌నదేన‌ని భూమా నాగిరెడ్డి అంగీక‌రించారు. అదే స‌మ‌యంలో ఇది సృష్టించిన ఆడియో అంటూ భూమా నాగిరెడ్డి తెలిపారు. ఏక‌కాలంలో ఇటు గొంతు త‌న‌దే అని చెప్ప‌డం మ‌రోవైపు సృష్టించినది అంటూ వ్యాఖ్యానించ‌డంతో కాంట్రాక్ట‌రును భూమా నాగిరెడ్డి బెదిరించింది నిజ‌మ‌ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/