Begin typing your search above and press return to search.

భూమా-శిల్పాల మధ్య మ‌ళ్లీ ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   24 April 2017 4:32 PM GMT
భూమా-శిల్పాల మధ్య మ‌ళ్లీ ర‌చ్చ‌
X
క‌ర్నూలు జిల్లా నంద్యాలలో తెలుగుదేశం శ్రేణుల మ‌ధ్య నెల‌కొన్న విబేధాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా నూత‌నంగా మంత్రి ప‌ద‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించిన యువ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ వ్య‌వ‌హార శైలి తీరుపై వారి వైరి వ‌ర్గ‌మైన శిల్పా బ్ర‌ద‌ర్స్ కు చెందిన నేత‌లు తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నంద్యాల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం సోమ‌వారం నిర్వ‌హించగా ఇటీవ‌లే మంత్రి ప‌ద‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ అఖిలప్రియ పాల్గొన్నారు. అయితే చైర్‌పర్సన్‌ దేశం సులోచన రాకముందే భూమా అఖిల ప్రియ సమావేశం ప్రారంభించారు. అంతే కాకుండా కాస్త ఆలస్యంగా సమావేశంలో పాల్గొన్న చైర్‌ పర్సన్‌ కు మంత్రి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో చైర్ ప‌ర్స‌న్ వ‌ర్గం మంత్రి అఖిల‌ప్రియ తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది.

చైర్‌ పర్సన్‌ రాకముందే మీటింగ్‌ ప్రారంభించడం కాకుంగా చైర్‌ పర్సన్‌ పట్ల అఖిల ప్రియ కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడంతో చైర్ పర్సన్ భర్త, కోఆప్షన్ మెంబర్ అయిన దేశం సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వర్గానికి మాట్లాడే అవకాశం ఎందుకివ్వరని అఖిలప్రియను ప్రశ్నించారు. పైగా వార్డులలో సమస్యలు ఉంటే చెప్పాలని అడుగుతున్నారే తప్ప చైర్‌ పర్సన్‌ కు అవకాశం ఇవ్వకపోవడం ఏమిట‌ని మంత్రి అఖిల ప్రియ తీరును త‌ప్పుప‌ట్టారు. అనంత‌రం మంత్రి అఖిల‌ప్రియ మాట్లాడుతూ తనకు కర్నూల్ వెళ్లాల్సి ఉందని, మీరు మాట్లాడుకోండి అని అన‌డంతో ఖంగు తిన‌డం చైర్ ప‌ర్స‌న్‌ వ‌ర్గం వంతు అయింది.

మ‌రోమారు చైర్ ప‌ర్స‌న్ భ‌ర్త జోక్యం చేసుకొని మంత్రి అఖిల‌ప్రియ తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ను మంత్రి అఖిల ప్రియ అవమానించారని మండిప‌డ్డారు. మంత్రి అయి ఉండి ఇలా చేయడం చాలా భాధ కలిగించిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/